చంద్రబాబుకు శిక్ష తప్పదు: పోచారం, భగవంతుడు కూడా కాపాడలేడని ఎమ్మెల్సీ

హైదరాబాద్‌: ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చట్టప్రకారం శిక్ష తప్పదని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. చంద్రబాబును నిజాయితీపరుడంటే ఎవరూ నమ్మరని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు తప్పు చేశారని, ఇప్పటికై తప్పు అంగీకరించాలని ఆయన అన్నారు.

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆ కేసు నుంచి బయటపడటానికి పడరాని పాట్లు పడుతున్నారని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అలాంటి కుట్రలు మానుకుని చేసిన తప్పును ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ నుంచి తెలంగాణ రాష్ర్టానికి పోలీసు భద్రతను ఎందుకు తెప్పించుకున్నారో తెలపాలని అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ చేస్తోన్న అభివృద్ధి పనులను చూసే ఇతర పార్టీల నేతలు తమ పార్టీలో చేరుతున్నారని వివరించారు.

Pocharam srinivas Reddy says Chandrababu trying to escape from the case

తమ ప్రభుత్వాన్ని చంద్రబాబు నామినేట్ చేయలేదని మంత్రి అన్నారు. బెదిరించే సంస్కృతి తమకు లేదని అన్నారు. డబ్బులు పంచింది మీరే అడ్డంగా దొరికింది మీరేనని అన్నారు. ఓటుకు నోటు కేసుకు సీఎం కేసీఆర్ కు సంబంధంలేదని వెల్లడించారు. తాము ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించలేదని, టిఆర్ఎస్ విధానాలు నచ్చినవారే తమ వద్దకు వస్తున్నారని ఆయన చెప్పారు.

ఇదిలావుంటే, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఆ కేసు నుంచి ఎలాగైనా బయటపడాలని కుట్రలు పన్నుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. కేసులో పీకల్లోతూ కూరుకుపోయిన చంద్రబాబును భగవంతుడు కూడా కాపాడలేరని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించాలని టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+