శ్రీశైలం వెళ్లే భక్తులకు పోలీసుల బిగ్ అలర్ట్..!!
శ్రీశైలం వెళ్లే భక్తులకు పోలీసులు కీలక సూచన చేసారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, రోడ్డు మార్గంతో పాటుగా రైల్వే ట్రాక్ లు పలు చోట్ల దెబ్బ తిన్నాయి. పలు రైళ్లను రద్దు చేయటగా..మరి కొన్ని దారి మళ్లించారు. ఇదే సమయంలో కొండ ప్రాంతాల్లో నివాసాల పైన కొండ చరియలు విరిగి పడుతున్నాయి. దీంతో, శ్రీశైలం వెళ్లే భక్తుల ప్రయాణం పైన పోలీసు అధికారులు పలు సూచనలు చేసారు.
కుండపోత వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిపై పలుచోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాగర్‌కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం ఈగలపెంట పాతాళ గంగ మధ్యన సుమారు 10 కిలోమీటర్ల దూరంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. బండరాళ్లు విరిగిపడుతుండటంతో శ్రీశైలం ఘాట్ రోడ్డు మార్గంలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ అధికారులు చర్యలు ప్రారంభించారు.

దీంతో, డచరియలు విరిగిపడుతున్న నేపథ్యంలో నాగర్‌కర్నూలు ఎస్పీ గైక్వాండ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వైపు వెళ్లొద్దని సూచించారు. ఘాట్ రోడ్డు మార్గంలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా శ్రీశైలం పర్యటనను విరమించుకోవాలని సూచించారు. కాగా నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ మండలం కొట్రతండా వద్ద తెలంగాణ పోలీసులు ఓ చెక్‌పోస్టును కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి వస్తున్న ప్రయాణికులను మధ్యలోనే ఆపి వెనక్కి పంపిస్తున్నారు. వర్షాలు తగ్గిన తరువాత ప్రయాణం చేసుకోవచ్చని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications