వాకర్స్‌కు ఇబ్బంది కలిగిస్తున్న బైక్ రేసర్స్, యువకులు బుక్
హైదరాబాద్: నగరంలోని నెక్లెస్ రోడ్డులో బైక్ రేసుల్లో పాల్గొంటున్న దాదాపు అరవై ద్విచక్రవాహనాలను పోలీసులు ఆదివారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. నెక్లెస్ రోడ్డులో బైక్ రేసంగ్ చేస్తూ తమకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని మార్నింగ్ వాకర్లు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు ఉదయం తనిఖీలు నిర్వహించారు. సెలవు దినం కావడంతో బైక్ రేసింగ్ చేసేందుకు పెద్ద సంఖ్యలో నెక్లెస్ రోడ్డుకు చేరుకున్న యువకులు బుక్ అయ్యారు. నగర శివార్లలోని గండిపేటలో పోలీసుల తనిఖీలు ఎక్కువ కావడంతో బైక్ రేసింగ్ కోసం యువకులు నెక్లెస్ రోడ్డు వైపు చూస్తున్నారు.

సెల్ ఛార్జింగ్ పెడుతూ షాక్‌తో గాయాలు
అదిలాబాద్ జిల్లాలో జూజులపేట గ్రామానికి చెందిన మాధురి అనే యువతి ఇంట్లో సెల్ ఫోన్ శనివారం ఉదయం చార్జింగ్ పెడుతూ విద్యుత్ సరఫరా కావడంతో చేతికి గాయాలయ్యాయి. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు చార్జింగ్ వైరును కర్రతో తీసివేశారు. అప్పటికే మాధురి స్పృహ కోల్పోవడంతో, ఆమెను ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications