ధర్నా: రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు, ఉద్రిక్తత

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని మహబూబ్ నగర్ జిల్లా పోలీసులు ముందుస్తుగా అదుపులోకి తీసుకున్నారు. కొడంగల్ మార్కెట్ యార్డ్ శంకుస్థాపనకు వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావుని రేవంత్ రెడ్డితో పాటు కార్యకర్తలు అడ్డుకుంటారనే సమాచారం అందడంతో ఆయనను అరెస్ట్ చేశారు.

రేవంత్ రెడ్డి ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించలేదంటూ ధర్నా నిర్వహించడంతో ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల వాహనాలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. జీపు అద్దాలను ధ్వంసం చేశారు.

Police arrest tdp mla revanth reddy in kodangal

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌కు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్ధితి అదుపు తప్పడంతో రేవంత్ రెడ్డితో పాటు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

రేవంత్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో కొడంగల్‌ మార్కెట్‌యార్డు గోదాం ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అదుపులోకి తీసుకున్న రేవంత్ రెడ్డిని దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పరిస్థితిని గమనించి భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.

దీంతో పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ కార్యకర్తలు బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ క్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు కొడంగల్ మార్కెట్ యార్డ్ శంకుస్థాపన చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+