మాటలతో వేధించేదని.. ఒంటరిగా ఉన్నప్పుడు అత్యాచారం చేసి, మెడకోసి చంపారు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: హైదరాబాదులోని మలక్ పేటలో పిఎస్ పరిధిలో సెప్టెంబర్ 29న వెలుగు చూసిన మహిళ దారుణ హత్య ఘటనలో మిస్టరీ వీడింది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

ఇద్దరు బాలురు ఉండడంతో జువెనైల్ హోం తరలించారు. మలక్‌పేట పోలీస్ స్టేషన్ ఈ సంఘటన జరిగింది. మలక్‌పేటకు చెందిన పర్వీన్‌ బేగం(38) ఢిల్లీకి చెందిన ఇక్రాముద్దీన్‌తో ఎనిమిదేళ్లుగా సహజీవనం చేస్తోంది.

 మాటలతో వేధించేది

మాటలతో వేధించేది

ఇక్రాముద్దీన్‌ చంగిచర్లలో మలక్‌పేట వాసి తఖీ అఫ్సర్‌తో కలిసి కొబ్బరి పీచు వ్యాపారం చేస్తున్నాడు. పని స్థలానికి పర్వీన్ బేగం తరచూ ఇక్రాముద్దీన్‌తో వెళ్లేది. ఈ క్రమంలో అక్కడ పని చేస్తున్న అసోం రాష్ట్రానికి చెందిన అమీర్‌ చంద్‌ (19)తోపాటు మరో ఇద్దరు బాలురను తరచూ మాటలతో వేధించేది.

కక్ష తీర్చుకోవాలనుకున్నారు

కక్ష తీర్చుకోవాలనుకున్నారు

ఓసారి చెప్పుతో కొట్టి అవమానించిందని అమీర్ చంద్‌, ఆ ఇద్దరు బాలురు ఆమెపై కక్ష తీర్చుకోవాలని పథకం వేశారు. ఇక్రాముద్దీన్‌ ఊరిలో లేని సమయం చూసుకుని గత నెల 25న రాత్రి పర్వీన్ బేగం ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఇంటికి వెళ్లారు.

అత్యాచారం చేసి కత్తితో మెడ కోశారు

అత్యాచారం చేసి కత్తితో మెడ కోశారు

అమీర్‌చంద్‌, 17 ఏళ్ల బాలుడు ఆమెపై అత్యాచారం చేసి కత్తితో మెడ కోశారు. అనంతరం ఇంటికి తాళం వేసి మూసీ ఒడ్డున కత్తి, తాళం చెవి పారేశారు. హత్య విషయం 29న వెలుగు చూడగా పోలీసులు విచారణ చేపట్టారు.

 ఆ దిశలో దర్యాఫ్తు చేయగా

ఆ దిశలో దర్యాఫ్తు చేయగా

పర్వీన్ బేగం సెల్ ఫోన్, అసోంకు చెందిన పదిహేనేళ్ల బాలుడి ఆచూకీ కనిపించడంలేదంటూ ఇక్రాముద్దీన్‌ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. సోమవారం నగరానికి వచ్చిన బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది. ఈమేరకు అమీర్‌చంద్‌ను అరెస్ట్‌ చేసి న్యాయస్థానానికి తరలించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Police arrest three people in Woman murders case in Malakapet in Hyderabad.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి