రేవంత్ రెడ్డి ఇంటితలుపులు బద్దలుకొట్టి అరెస్ట్ చేసిన పోలీసులే.. ఇప్పుడు ఎస్కార్ట్ గా!!

తెలంగాణ రాష్ట్రంలో తాజా ఎన్నికల ఫలితాల తర్వాత ప్రస్తుత ప్రభుత్వ ఏర్పాటు పైన, కెసిఆర్ పాలన పైన, కెసిఆర్ పాలన సమయంలో జరిగిన వివిధ సంఘటనల పైన ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే సరిగ్గా డిసెంబర్ 4 నాడు ఐదేళ్ల క్రితం జరిగిన ఒక ఘటన తెలంగాణలో చర్చనీయాంశమైంది.

ఐదు సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి ని డిసెంబర్ 4వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కోస్గి పర్యటనను అడ్డుకోవాలని రేవంత్ పిలుపునివ్వడంతో టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొడంగల్ పోలీస్ స్టేషన్లో రేవంత్ రెడ్డి పై అప్పుడు కేసు నమోదయింది.

police arrested revanth reddy then.. police escorted revanth now..

ఇక రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన తీరు చర్చనీయాంశం అయ్యింది. తలుపులు పగల కొట్టి బెడ్ రూమ్ లోకి వెళ్లి బలవంతంగా తీసుకువెళ్లారు. అప్పట్లో అది హాట్ టాపిక్ అయింది. ప్రతిపక్ష పార్టీల నాయకుల పై నిరంకుశ వైఖరి కేసీఆర్ అవలంబిస్తున్నారని చర్చ జరిగింది. రేవంత్ రెడ్డి ప్రజలను రెచ్చగొడుతున్నారని, కొడంగల్ బంద్ కు పిలుపునిచ్చారని ఫిర్యాదు చేశారు.

సీఎం కేసీఆర్ నిర్వహించే బహిరంగ సభను అడ్డుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని చేసిన ఫిర్యాదు మేరకు రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారు. ఆపై పోలీసులు ఎక్కడికి తీసుకువెళ్లారు అనేది కూడా తెలియకుండా రేవంత్ రెడ్డిని వాహనంలో తిప్పడం వంటి ఘటనలతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

రేవంత్ రెడ్డి కేసీఆర్ ని దీటుగా ఎదుర్కొని, కేసులలో జైలుకు వెళ్లి జైలు శిక్ష అనుభవించి అయినా పట్టువదలని విక్రమార్కుడిలా కెసిఆర్ పై పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇక ఆ పోరాటం ఫలితమే, ఏ పోలీసులు అయితే తలుపులు బద్దలు కొట్టి రేవంత్ రెడ్డి ని బలవంతంగా ఐదేళ్ల క్రితం అరెస్టు చేసి జైలుకు తీసుకువెళ్లారో అదే పోలీసులు 2023 డిసెంబర్ 4వ తేదీన ఎస్కార్ట్ వాహనాలతో రాజ్ భవన్ కు రేవంత్ రెడ్డిని తీసుకువెళ్ళారు.

ఇక ఇదే విషయం కాంగ్రెస్ శ్రేణులలో ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. ఓడలు బళ్ళు.. బళ్ళు ఓడలు అవ్వడం అంటే ఇదేనని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. కష్టాలు వచ్చాయని వెనకడుగు వేస్తే, ఇప్పుడు ఈ ఘనత సాధ్యమయ్యేది కాదని, రేవంత్ రెడ్డి ఎవరికి భయపడకుండా ముందుకు సాగాడు కాబట్టి ఇప్పుడు తెలంగాణలో అధికారాన్ని దక్కించుకుని తానేమిటో నిరూపించుకున్నాడని చెప్పుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+