Crime News: నవ్వుతో ఆకర్షిస్తారు.. చూపుతో కైపెక్కిస్తారు.. చివరికి నిలువు దోపిడీ చేస్తారు..
వారి టార్గెట్ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లే వారి టార్గెట్.. అమాయక యువకులే వారి లక్ష్యం.. నవ్వులతో ఆకర్షిస్తారు. సైగలతో కైపెక్కిస్తారు. మొత్తానికి ముగ్గులోకి దించుతారు. నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి నిలువు దోపిడీ చేస్తారు. ఇలా ఒకటి రెండు కాదు పదుల్లో చేశారు.. పోలీసులకు చిక్కారు.

ఒక గ్రూప్ గా
వరంగల్ జిల్లా కొత్తూరు గ్రామానికి చెందిన విజయ్‌కుమార్, పర్వతగిరికి చెందిన రాయపురం సరిత, కేసముద్రంకు చెందిన కోడం స్వరూప, నూనె స్వప్నలకు గతంలో పరిచయాలు ఉన్నాయి. అయితే వీరు ఒక గ్రూప్ గా ఏర్పడి డబ్బు సంపాదించాలనుకున్నారు. అందుకోసం వారు ఓ ప్రణాళిక రచించారు.

యువకులు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు టార్గెట్ చేసుకున్నారు. వ్యభిచారం ముసుగులో దోపిడీలకు పాల్పడడం మొదలు పెట్టారు. ముగ్గురు మహిళలు బస్‌స్టేషన్‌లలో అమాయకులైన యువకులను ట్రాప్ చేస్తారు. తమ వేషదారణతో మత్తెకిస్తారు. బయటకు వెళ్దాం పద అని ఓ వాహనంలో ఎక్కించుకుని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్తారు.

వాట్సాప్
వాహనంలో వెళ్తున్న క్రమంలో విజయ్ కుమార్ వాట్సాప్ చేస్తారు. అతన కూడా నిర్జన ప్రాంతానికి వెళ్తాడు. యువకులను బెదిరించి డబ్బులు, సెల్ ఫోన్లు, బంగారం లాక్కుంటాడు. వీరిపై మామునూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు కేసుల్లో రూ.20వేలు, సెల్‌ఫోన్, గీసుకొండ పీఎస్ పరిధిలో రూ.3వేలు, సెల్‌ఫోన్‌లను దోపిడీ చేసినట్లు కేసులు నమోదయ్యాయి.

రాంగోపాల్‌పురం
ఈ ముఠాపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో వారు రాంగోపాల్‌పురం బస్టాండ్ వద్ద ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న మామునూరు ఇన్‌స్పెక్టర్ క్రాంతికుమార్ తన సిబ్బందితో సోమవారం వద్ద నిందితురాళ్లను
అదుపులోకి తీసుకున్నారు. కాగా నిందితులను పట్టుకున్నందుకు ఏసీపీ నరేష్‌కుమార్, ఇన్‌స్పెక్టర్ క్రాంతి కుమార్, ఎస్సై రాజిరెడ్డి, కానిస్టేబుళ్లు సర్థార్‌పాషా, రోజాలను ఈస్ట్‌జోన్ డీసీపీ డీసీపీ వెంకటలక్ష్మీ అభినందించారు.












Click it and Unblock the Notifications