నా కొడుకు క్రమశిక్షణ గలవాడు: రాష్ డ్రైవింగ్‌పై సుజన (పిక్చర్స్)
హైదరాబాద్: కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ నేత సుజనా చౌదరి తనయుడు శ్రీకార్తిక్ (25) శుక్రవారం అర్ధరాత్రి అతివేగంగా వాహనం నడుపుతుండగా ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. అతని పైన శనివారం నాడు కేసు నమోదయింది. దీనిపై సుజనా చౌదరి స్పందించారు.
తన కొడుకు శ్రీకార్తీక్ చాలా క్రమశిక్షణగా ఉంటాడని, అలాగే పెరిగాడని సుజనా చౌదరి చెప్పారు. అతని పైన అమెరికాలే లేదా భారత్‌లో ఎక్కడా కేసులు లేవని చెప్పారు. తన కొడుకు, అతని స్నేహితులు రాత్రి పదిన్నర గంటల సమయంలో జాయ్ రైడ్‌కు వెళ్లారని, రాష్ డ్రైవింగ్ కేసు సరికాదన్నారు.
కాగా, శ్రీకార్తీక్ పెళ్లి ఈ నెల 23వ తేదీన ఉంది. ఇందుకోసం అతను ఇటీవలే అమెరికా నుంచి భారత్ వచ్చాడు. అమెరికాలో అతని స్టడీస్ పూర్తయ్యాయి. సుజనా తనయుడుశ్రీకార్తిక్ శుక్రవారం అర్ధరాత్రి అతివేగంగా వాహనం నడుపుతుండగా ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

సుజన కొడుకు
శ్రీకార్తిక్ తన ఖరీదైన పోర్షే (ఏపీ09 సీవీ 9699) వాహనంలో స్నేహితులతో కలిసి అతివేగంగా వెళ్తుండగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు నిలువరించబోయారు. ఆపకుండా అతను వెళ్లిపోయాడు. ఎన్టీఆర్ భవన్ ముందున్న పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు పట్టుకున్నారు.

సుజన చౌదరి
ఆ సమయంలో వాహనం దాదాపు 120 నుంచి 140 కి.మీ వేగంతో వెళుతున్నట్లు పశ్చిమ మండల ట్రాఫిక్ డీసీపీ ఎల్ఎస్ చౌహాన్ శనివారం విలేకరులకు వెల్లడించారు. మోటారు వాహన చట్టం ప్రకారం 184(బి) సెక్షన్ కింద రూ.1000 జరిమానా విధించినట్లు తెలిపారు. పట్టుబడిన వాహనం సుజన యూనివర్శల్ ఇండస్ట్రీస్ పేరు మీద ఉందన్నారు.

బైకులు
హైదరాబాదులో రాష్ డ్రైవింగ్‌కు పాల్పడిన వారి వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని వరుసలో పెట్టిన దృశ్యం.

బైకులు
మరో సంఘటనలో రోహిత్ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన పరమ్ గోప్త తన ఆడీ వాహనం(ఏపీ 28 సీఎల్ 6060)లో అతివేగంగా వెళ్తూ పట్టుబడ్డాడు. అతనికి రూ.1100 జరిమానా విధించినట్లు తెలిపారు. రేసింగ్‌లు నిర్వహిస్తున్న పలు వాహనాలను కూడా పట్టుకున్నామన్నారు.












Click it and Unblock the Notifications