ఓయూలో ఉద్రిక్తతకు దారితీసిన బీఫ్ ఫెస్ట్ రన్: అరెస్టులు(పిక్చర్స్)
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో డిసెంబర్ 10న నిర్వహించతలపెట్టిన బీఫ్ ఫెస్టివల్‌పై ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోమవారం ప్రజాస్వామిక సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో బీఫ్ ఫెస్టివల్‌కు మద్దతుగా పలు విద్యార్థి సంఘాలు 2కెరన్ నిర్వహించారు. 2కెరన్ ప్రారంభంతోనే 20మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరికొంత మంది గ్రూపులుగా విడిపోయి 2కెరన్‌కు సిద్ధమవుతున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఓయూలో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో డిసెంబర్ 10వ తేదీన వామపక్ష దళిత మైనార్టీ విద్యార్థి సంఘాలు నిర్వహించతలపెట్టిన బీఫ్, పోర్క్ ఫెస్టివల్‌కు ఏలాంటి అనుమతిలేదని నగర పోలీసులు స్పష్టం చేశారు.
ఓయూ పరిసర ప్రాంతాల్లో 144సెక్షన్ వారం రోజులపాటు అమలులో ఉంటుందని పేర్కొన్నారు. శాంతి భద్రతల దృష్ట్యా డిసెంబర్ 12వ తేదీ వరకు ఎలాంటి ఉత్సవాలకు అనుమతించడంలేదని ఈస్ట్ జోన్ డిసిపి డాక్టర్ వి రవీందర్ తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు సహకరించాలని ఆయన కోరారు. శాంతి, భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని డిసిపి హెచ్చరించారు.
యథాతథ స్థితి
ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ)లో బీఫ్ ఫెస్టివల్, పోర్క్ ఫెస్టివల్ నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైదరాబాద్ నగర న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. డిసెంబర్ 10న వీటిని నిర్వహించాలన్న కొందరి ప్రయత్నాలను నిలువరించేందుకు సుంకరి జనార్దన్‌గౌడ్ అనే న్యాయవాది సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు.
దీన్ని సోమవారం విచారణకు స్వీకరించిన న్యాయస్థానం డిసెంబర్ 20 వరకు ఓయూలో యథాతథ స్థితి కొనసాగించాలని వర్సిటీ రిజిస్ట్రార్‌ను, పోలీసులను ఆదేశించిందని జనార్దన్‌గౌడ్ మీడియాకు చెప్పారు. ఓయూలో బీఫ్, పోర్క్ ఫెస్టివల్స్ నిర్వహించడం వల్ల ఇతర విద్యార్థులు ఇబ్బందులు పడటంతోపాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం కూడా ఉందని ఆయన తెలిపారు.
కాగా, 10న ఇందిరాపార్కు వద్ద నిర్వహించతలపెట్టిన గోరక్షణపై అవగాహన సదస్సుకు అనుమతివ్వాలని కోరుతూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సోమవారం నగర కమిషనర్ మహేందర్‌రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోవులను రక్షిస్తే దేశం సకల సంపదతో తులతూగుతుందన్నారు. గోవుల పరిరక్షణపై ప్రజలకు తెలియాలనే అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
ఇది ఇలా ఉండగా, బీఫ్ ఫెస్టివల్‌కు మద్దతుగా శనివారం సిపిఐ మాజీ రాజ్యసభ సభ్యుడు అజీజ్ పాషా, సిపిఎం రాష్ట్ర నాయకురాలు మల్లు స్వరాజ్యం, పిడబ్ల్యుఓ రాష్ట్ర కార్యదర్శి సంధ్యతోపాటు బీఫ్ ఫెస్టివల్ నిర్వాహకులు స్టాలిన్ తదితరులు రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించిన విషయం విధితమే. అదేవిధంగా ఈ సమావేశానికి హాజరయ్యేందుకు పాతబస్తీ నుంచి బయలుదేరిన మజ్లిస్-బచావో-తహరిక్(ఎంబిటి) రాష్ట్ర నేత అమ్జదుల్లాఖాన్‌ను సౌత్‌జోన్ పోలీసులు అరెస్టు చేశారు.

ఉద్రిక్తతకు దారితీసిన బీఫ్ ఫెస్ట్ రన్
ఉస్మానియా యూనివర్సిటీలో డిసెంబర్ 10న నిర్వహించతలపెట్టిన బీఫ్ ఫెస్టివల్‌పై ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఉద్రిక్తతకు దారితీసిన బీఫ్ ఫెస్ట్ రన్
సోమవారం ప్రజాస్వామిక సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో బీఫ్ ఫెస్టివల్‌కు మద్దతుగా పలు విద్యార్థి సంఘాలు 2కెరన్ నిర్వహించారు. 2కెరన్ ప్రారంభంతోనే 20మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఉద్రిక్తతకు దారితీసిన బీఫ్ ఫెస్ట్ రన్
మరికొంత మంది గ్రూపులుగా విడిపోయి 2కెరన్‌కు సిద్ధమవుతున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఓయూలో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

ఉద్రిక్తతకు దారితీసిన బీఫ్ ఫెస్ట్ రన్
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో డిసెంబర్ 10వ తేదీన వామపక్ష దళిత మైనార్టీ విద్యార్థి సంఘాలు నిర్వహించతలపెట్టిన బీఫ్, పోర్క్ ఫెస్టివల్‌కు ఏలాంటి అనుమతిలేదని నగర పోలీసులు స్పష్టం చేశారు.

ఉద్రిక్తతకు దారితీసిన బీఫ్ ఫెస్ట్ రన్
ఓయూ పరిసర ప్రాంతాల్లో 144సెక్షన్ వారం రోజులపాటు అమలులో ఉంటుందని పేర్కొన్నారు. శాంతి భద్రతల దృష్ట్యా డిసెంబర్ 12వ తేదీ వరకు ఎలాంటి ఉత్సవాలకు అనుమతించడంలేదని ఈస్ట్ జోన్ డిసిపి డాక్టర్ వి రవీందర్ తెలిపారు.

ఉద్రిక్తతకు దారితీసిన బీఫ్ ఫెస్ట్ రన్
ఉస్మానియా యూనివర్సిటీలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు సహకరించాలని ఆయన కోరారు.

ఉద్రిక్తతకు దారితీసిన బీఫ్ ఫెస్ట్ రన్
శాంతి, భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని డిసిపి హెచ్చరించారు.












Click it and Unblock the Notifications