'పార్వతి కోసం వెతుకుతున్నాం, గజల్ శ్రీనివాస్‌కు బెయిల్ వద్దు, రికార్డ్ చేయాల్సి ఉంది'
Recommended Video

గజల్ శ్రీనివాస్ ఏమయ్యాడు ?
హైదరాబాద్: మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో గాయకుడు గజల్ శ్రీనివాస్ ఇటీవల మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పోలీసులు కౌంటర్ ఫైల్ దాఖలు చేశారు. గజల్ శ్రీనివాస్‌కు బెయిల్ ఇవ్వవద్దని కోరారు.
ఏ2 నిందితురాలు పార్వతి పరారీలో ఉన్నారని, ఆమె కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. గజల్ కేసులో బాధితురాలి స్టేట్‌మెంట్ ఇంకా రికార్డ్ చేయాల్సి ఉందని చెప్పారు. బాధితులు పెరిగే అవకాశముందని, సాక్ష్యులను విచారించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

కాబట్టి గజల్ శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసులు తమ కౌంటర్ పిటిషన్లో పేర్కొన్నారు. కాగా, గజల్ శ్రీనివాస్ పైన ఓ యువతి వేధింపుల కేసు పెట్టిన విషయం తెలిసింది. దీంతో ప్రస్తుతం అతను జైలులో ఉన్నారు.












Click it and Unblock the Notifications