Johnny Master: జానీ మాస్టర్ కు షాక్.. ఫోక్సో కేసు.. మహిళా కమిషన్ కు ఫిర్యాదు..
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మహిళ కొరియోగ్రాఫర్ అతనిపై కేసు పెట్టింది. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు కేసును నర్సింగి పోలీసులకు బదిలీ చేశారు. జానీ మాస్టర్ పై తొలుత 375 అత్యాచారంతోపాటు పలు సెక్షన్లు నమోదు చేశారు. తాజాగా ఫోక్సో కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి వయస్సు దృష్ట్యా ఈ కేసు నమోదు చేశారు.
పోలీసులు జానీ మాస్టర్ కోసం గాలిస్తున్నారు. జానీ మాస్టర్ లడఖ్‌లో ఉన్నట్టు సమాచారం.. దీంతో అతన్ని అరెస్ట్ చేయడానికి పోలీసు బృందాలు లడఖ్ బయల్దేరినట్లు తెలుస్తోంది. నాలుగు బృందాలు జానీ మాస్టర్ కోసం గాలిస్తున్నాయి. మరోవైపు మహిళా సంఘాలు జానీ మాస్టర్ పై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో మహిళా కమిషన్ కూడా త్వరలో స్పందించే అవకాశం ఉంది. మొదటగా జానీ మాస్టర్ నెల్లూరు ఉన్నట్లు ప్రచారం జరిగింది. జానీ మాస్టర్ ఇష్యూపై ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ విషయం తమ కమిటీ విచారణ జరుపుతుందని వారు ప్రకటించారు. తాజాగా ఈ విషయమై నటి కరాటే కల్యాణి కూడా స్పందించారు. ఈ కేసును లవ్ జిహాద్ కేసుగా ఆమె అభివర్ణించారు. లైంగిక వేధింపుల కేసులో తప్పు రుజువైతే జానీ మాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని కరాటే కళ్యాణి స్పష్టం చేశారు. జానీ మాస్టర్ మతం మారితే పెళ్లి చేసుకొంటానని చెప్పడమేంటని ఫైర్ అయ్యారు. కాగా ఈ కేసులో ఇప్పటికే బాధితురాలి స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు.
బాధితురాలికి ప్రముఖ హీరో అండగా నిలిచినట్లు నటి, యాంకర్ ఝాన్సీ తెలిపారు. ఆ హీరో ఎవరు అనేది చర్చలు జరుగుతున్నాయి. ఆ హీరో అల్లు అర్జునేనని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున తన మేనేజర్ ద్వారా బాధితురాలికి అండగా ఉంటానని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. బాధితురాలు పుష్ప 2 లో పలు పాటలకు కొరియోగ్రాఫి చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications