రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు: ఇలా వెంటపడి కాల్పులు జరిపిన పోలీసులు(పిక్చర్స్, వీడియో)
హైదరాబాద్: నగరంలో సోమవారం చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. గంటలోపే మూడు చోట్ల దొంగతనాలకు పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారు. అల్వాల్, రాంగోపాల్‌పేట్‌లలో వరుస దొంగతనాలతో హడలెత్తించారు. అల్వాల్‌లో ఓ మహిళ మెడలోని రెండు తులాల గొలుసును లాక్కెళ్లారు.
రాంగోపాల్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ కాలనీకి మహిళ మెడలోంచి ఏడు తులాల బంగారు గొలుసును తెంచుకెళ్లారు. వనస్థలిపురం అటోనగర్‌లో ఓ మహిళ మెడలోని గొలుసు లాక్కెళ్లేందుకు యత్నిస్తున్న దుండగులపై అక్కడే వున్న యాంటి చైన్‌స్నాచింగ్ టీం పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు.
సోమవారం ఉదయం సంచలనం సృష్టించి సంఘటన వివరాల్లోకి వెళితే.. హుడా సాయినగర్‌లో నివాసం ఉండే అనురాధ(38) భర్తతో కలిసి ఆటోనగర్‌లో హోటల్‌ను నిర్వహిస్తోంది. ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్తుండగా వెనుకనుండి ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని గొలుసును అపహరించుకెళ్లే ప్రయత్నం చేశారు.
దీంతో అక్కడే మఫ్టిలో ఉన్న యాంటి స్నాచింగ్ టీం పోలీసులు వారిని పట్టుకునేందుకు యత్నించగా పారిపోవడంతో వారిపై కాల్పులు జరిపారు. అయితే, చైన్ స్నాచర్లు తప్పించుకుని పారిపోయారు. వారి పోలీసులు ఆ ప్రాంతంలో తీవ్రంగా గాలించినా ఫలితం లేకుండా పోయింది.

చైన్ స్నాచర్లు
హైదరాబాద్ నగరంలో సోమవారం చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. గంటలోపే మూడు చోట్ల దొంగతనాలకు పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారు.

చైన్ స్నాచర్లు
అల్వాల్, రాంగోపాల్‌పేట్‌లలో వరుస దొంగతనాలతో హడలెత్తించారు. అల్వాల్‌లో ఓ మహిళ మెడలోని రెండు తులాల గొలుసును లాక్కెళ్లారు.

చైన్ స్నాచర్లు
రాంగోపాల్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ కాలనీకి మహిళ మెడలోంచి ఏడు తులాల బంగారు గొలుసును తెంచుకెళ్లారు.

చైన్ స్నాచర్లపై కాల్పులు
వనస్థలిపురం అటోనగర్‌లో ఓ మహిళ మెడలోని గొలుసు లాక్కెళ్లేందుకు యత్నిస్తున్న దుండగులపై అక్కడే వున్న యాంటి చైన్‌స్నాచింగ్ టీం పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు.

చైన్ స్నాచర్లపై కాల్పులు
అయితే, చైన్ స్నాచర్లు తప్పించుకుని పారిపోయారు. వారి పోలీసులు ఆ ప్రాంతంలో తీవ్రంగా గాలించినా ఫలితం లేకుండా పోయింది.

చైన్ స్నాచర్లపై కాల్పులు
సోమవారం ఉదయం సంచలనం సృష్టించి సంఘటన వివరాల్లోకి వెళితే.. హుడా సాయినగర్‌లో నివాసం ఉండే అనురాధ(38) భర్తతో కలిసి ఆటోనగర్‌లో హోటల్‌ను నిర్వహిస్తోంది.

చైన్ స్నాచర్లపై కాల్పులు
ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్తుండగా వెనుకనుండి ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని గొలుసును అపహరించుకెళ్లే ప్రయత్నం చేశారు.

చైన్ స్నాచర్లపై కాల్పులు
దీంతో అక్కడే మఫ్టిలో ఉన్న యాంటి స్నాచింగ్ టీం పోలీసులు వారిని పట్టుకునేందుకు యత్నించగా పారిపోవడంతో వారిపై కాల్పులు జరిపారు.

పారిపోతున్న చైన్ స్నాచర్లు
కాగా, జాయింట్ కమిషనర్ జాయింట్ కమిషనర్ శశిధర్‌రెడ్డి, ఎల్బీనగర్ డిసిపి తస్ఫీర్ ఇక్బాల్‌తో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

బాధితురాలు
చైన్ స్నాచింగ్ జరిగిన తీరును బాధితురాలిని అడిగి తెలుసుకున్నారు.

ఘటనా స్థలంలో..
దుండగులు నంబర్‌లేని నల్లటి పల్సర్ బైక్‌పై పరారైనట్టు సిసి కెమెరా పుటేజిని బట్టి తెలుస్తుందని చెప్పారు.

బాధితురాలు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఘటనా స్థలంలో
పరిశీలించిన వారిలో ఏసిపి భాస్కర్‌గౌడ్, సిఐలు పుష్పన్‌కుమార్, డిఐ విజయ్‌కుమార్ ఉన్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications