హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్వచ్ఛ హైదరాబాద్: పారపట్టిన సీపీ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సైబరాబాద్ పోలీసులు స్వచ్ఛ హైదరాబాద్‌కు ముందుకొచ్చారు. తమ ప్రాంతంలో ఉన్న సర్కారీ దవాఖానాలను దత్తత తీసుకొని వాటి పరిశుభ్రతకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. కేవలం పరిశుభ్రత, పచ్చదనం పెంపునకే పరిమితం కాకుండా ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనలో భాగస్వాములమవుతామంటున్నారు.

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ స్వయంగా మంగళవారం కొండాపూర్‌లోని ఏరియా ఆసుపత్రిలో పరిశుభ్రత పనులకు శ్రీకారం చుట్టారు. పలుగు, పార చేతపట్టి ఆసుపత్రిలో పేరుకపోయిన చెత్తాచెదారం తొలిగింపులో పాల్గొన్నారు.

స్వచ్ఛ హైదరాబాద్: పారపట్టిన సీపీ

స్వచ్ఛ హైదరాబాద్: పారపట్టిన సీపీ

గోడలకు రంగులు వేశారు. ఆసుపత్రిని తాను దత్తత తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. హోంగార్డుల నుంచి డీసీపీ వరకు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతినెలా నాల్గవ శనివారం ఆసుపత్రులను సందర్శించి అక్కడ పరిసరాల పరిశుభ్రత కోసం శ్రమదానం చేయనున్నట్లు ఆయన తెలిపారు.

 స్వచ్ఛ హైదరాబాద్: పారపట్టిన సీపీ

స్వచ్ఛ హైదరాబాద్: పారపట్టిన సీపీ

సి.వి. ఆనంద్ మాట్లాడుతూ నేను ప్రభుత్వ ఆసుపత్రిలోనే జన్మించాను. అప్పట్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు ఎంతో బాగుండేవి. సీఎం కేసీఆర్ ఇచ్చిన స్వచ్ఛ తెలంగాణ పిలుపులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులను ఎంపిక చేసుకున్నామని అన్నారు.

 స్వచ్ఛ హైదరాబాద్: పారపట్టిన సీపీ

స్వచ్ఛ హైదరాబాద్: పారపట్టిన సీపీ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమానికి బుధవారం అంకురార్పణ జరగనుంది. స్వచ్ఛ హైదరాబాద్‌పై నేడు హెచ్‌ఐఐసీసీ వేదికగా ఏర్పాటు చేసిన ఓరియెంటేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు.

 స్వచ్ఛ హైదరాబాద్: పారపట్టిన సీపీ

స్వచ్ఛ హైదరాబాద్: పారపట్టిన సీపీ

మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు (మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శులతో సహా), ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగులు(ఐఏఎస్, ఐపీఎస్), వివిధ శాఖాధిపతులు హాజరు కానున్నారు.

 స్వచ్ఛ హైదరాబాద్: పారపట్టిన సీపీ

స్వచ్ఛ హైదరాబాద్: పారపట్టిన సీపీ

గ్రేటర్ హైదరాబాద్‌ను 400 యూనిట్లుగా విభజించనున్నారు. ఒక్కో యూనిట్‌కు ముఖ్యమంత్రి, మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శులు, ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగులు, వివిధ శాఖాధిపతులు ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తారు.

 స్వచ్ఛ హైదరాబాద్: పారపట్టిన సీపీ

స్వచ్ఛ హైదరాబాద్: పారపట్టిన సీపీ

ఈ ఓరియంటేషన్‌లో స్వచ్ఛతెలంగాణ, స్వచ్ఛహైదరాబాద్ కార్యక్రమాలపై మున్సిపల్ వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి, నగర పోలీస్ కమిషనర్, వాటర్ వర్క్స్ ఎండీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో వెల్లడించనున్నారు.

English summary
Police personnel participated in Swachh Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X