గాంధీభవన్ లో కేసీఆర్ 420 ప్రచార కార్లను ఎత్తుకెళ్ళిన పోలీసులు!!

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిని మించి ఒకరు దూకుడును కొనసాగిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నేతలు కారు గుర్తు ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి బొమ్మ కార్లను ఉపయోగిస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తుంటే, కాంగ్రెస్ నేతలు రివర్స్ అటాక్ చేస్తూ రాజకీయాన్ని రసవత్తరంగా మార్చారు.

ఇక కాంగ్రెస్ పార్టీ జనాల్లోకి కల్వకుంట్ల కుటుంబం చేస్తున్న స్కామ్లను పంపించే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ 420 కార్ ను రెడీ చేసి ప్రచారానికి రంగంలోకి దింపింది. కాంగ్రెస్ రంగంలోకి దింపిన ఈ కార్ల నిండా కాళేశ్వరం వంటి ప్రాజెక్టులలో చేసినటువంటి అవినీతి, టిఎస్పిఎస్సి పేపర్ల లీకేజ్, ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత ప్రమేయం మొదలైన అంశాలపై కీలక విమర్శలను రాసి, నియోజకవర్గాలలో తిప్పాలని ప్లాన్ చేసింది.

 Police took KCR 420 campaign cars from congress Gandhi Bhavan!!

అయితే కాంగ్రెస్ పార్టీ సరికొత్తగా ప్రచారం చేయడానికి తీసుకువచ్చిన ఈ ప్రచార వాహనాలను గాంధీభవన్లోకి వెళ్లి పోలీసులు దౌర్జన్యంగా ఎత్తుకెళ్లారు. కేసీఆర్ 420అని ప్రజలకు అర్ధమయ్యేలా ఈ వాహనాలపై రాసిన అంశాలే కాదు .. అందులో కేసీఆర్ పాలనను టార్గెట్ చేస్తూ పాటలు కూడా ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ.

 Police took KCR 420 campaign cars from congress Gandhi Bhavan!!

ఇక ప్రస్తుతం ఈ వాహనాలపై చర్చ జరుగుతున్న సమయంలో కెసిఆర్ 420 వాహనాలను గాంధీభవన్ లోని సిబ్బంది మొత్తం వెళ్ళిపోయిన తర్వాత గాంధీ భవన్ లోపలికి వెళ్లి పోలీసులు వాహనాలను తీసుకుపోయారు. ఇలా పోలీసులు దౌర్జన్యం గా తీసుకుపోవడాన్ని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. పోలీసులు బిఆర్ఎస్ కు తొత్తుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

 Police took KCR 420 campaign cars from congress Gandhi Bhavan!!

పోలీసులు వెంటనే కాంగ్రెస్ పార్టీ వాహనాలను తిరిగి గాంధీ భవన్ లో అప్పగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. పోలీసులు కావాలని కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా, తమ ప్రచార వాహనాలను ఎత్తుకు వెళ్లారని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+