రాజధానిలో 11వేల మంది నేరచరితులపై సర్వే: దృష్టి సారించిన పోలీసులు
హైదరాబాద్: నగరంలో పెరిగిపోతున్న చైన్ స్నాచింగ్‌లు, దొంగతనాలపై పోలీసులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని 11వేలమంది నేరచరితులపై నిఘా వేశారు. ప్రస్తుతం వారంతా ఏం చేస్తున్నారనే దానిపై నివేదిక తయారు చేస్తున్నారు.
కాగా, సౌత్, వెస్ట్ జోన్లలోనే ఎక్కువ మంది నేరస్తులు ఉన్నట్లు తెలిసింది. సుమారు 6వేల మంది నేరచరితులు ఈ రెండు జోన్లలోనే ఉన్నట్లు సమాచారం. ఒకే రోజు నేరస్తులందర్నీ పోలీస్ స్టేషన్‌లకు పిలిపించి విచారణ చేసేందుకు సిద్ధమవుతున్నారు నగర పోలీసులు.

ఇందు కోసం స్పెషల్ డ్రైవ్ చేయనున్నట్లు నగర పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. సమగ్ర సర్వే తరహాలో నేరచరితులపై సర్వే చేసి, వారి రోజువారీ వ్యవహారాలను పరిశీలించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా రూపుదిద్దుతున్న నేపథ్యంలో నేరాలు జరగకుండా చర్యలు చేపట్టేందుకు పటిష్టమైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెస్ట్ జోన్ డిసిపి వెంకటేశ్వర్ రావు తెలిపారు.
ఇప్పటికే చైన్ స్నాచర్లను పట్టుకునేందుకు నగరంలోని పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. బైక్ పై వచ్చి గొలుసులను తెంచుకుని వెళ్లే చైన్ స్నాచర్ల పని పట్టేందుకు క్విక్ రెస్పాన్స్ అయ్యేలా పోలీసులు శిక్షణ పొందుతున్నారు.












Click it and Unblock the Notifications