రైతన్నలకు అండగా.. నకిలీ విత్తనాల విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామంటున్న సూపర్ పోలీస్
సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ మాత్రమే కాకుండా, రైతన్నలకు కూడా అండగా నిలవాలని, రైతులను మోసం చేసే వారి భరతం పట్టాలని వరంగల్ కమిషనరేట్ పోలీసులు కంకణం కట్టుకున్నారు. నిన్నటికి నిన్న అన్నదాతల వద్ద ధాన్యం కొనుగోలు చేసి తిరిగి వారికి డబ్బులు చెల్లించని వ్యాపారులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరికలు జారీచేశారు వరంగల్ సిపి ఏ.వీ రంగనాథ్.
నిన్న కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన రవిశెట్టి రవిబాబు అనే వ్యాపారి వరంగల్, కరీంనగర్ జిల్లాలోని రైతన్నల నుండి ధాన్యం కొనుగోలు చేసి వారికి ఇవ్వాల్సిన డబ్బులను ఇవ్వకుండా మోసం చేస్తే, అతనిపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలిసారిగా పిడీ యాక్ట్ నమోదు చేశారు. దీంతో అన్నదాతలను మోసం చేసిన సదరు వ్యాపారిని చర్లపల్లి జైలుకి తరలించారు.

ఇక నేడు అన్నదాతలకు అండగా నకిలీ విత్తనాల విక్రయదారుల భరతం పట్టడానికి రంగం సిద్ధం చేశామని వెల్లడించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందింతే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు. వానాకాలం సాగు ప్రారంభమవుతున్న సమయాన్ని దృష్టిలో వుంచుకుని రైతన్నలు నకిలీ విత్తనాల బారీన పడకుండా ముందస్తు చర్యలకై పరంగల్ కమిషనరేట్ పోలీసులు సిద్ధమయ్యారు.
ఈ నకిలీ విత్తనాల నియంత్రణకై వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వీ రంగనాథ్ నేడు ఓ ప్రకటన చేస్తూ ఎవరైన వ్యాపారస్థులు, సంస్థలు, వ్యక్తులు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందితే తక్షణమే స్థానిక పోలీసులకుగాని లేదా నేరుగా తనకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఫోన్ నంబర్ 8712685100కు, టాస్క్ఫోర్స్ ఏసిపి ఫోన్ నంబర్ 8712685148, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి ఫోన్ నంబర్ 8712685101కు సమాచారం అందించాలని సూచించారు.

సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు, కీలక సమచారం అందించిన వ్యక్తులకు పారితోషకాలను అందించడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమీషనర్ తెలియజేశారు. రైతులు ఎవరైనా మోసం చేయాలని చూస్తే వారిపై ఉక్కుపాదం మోపుతామని, రైతన్నలకు అండగా వరంగల్ పోలీసులు ఉంటారని ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications