Sunil Kanugolu:కాంగ్రెస్ విజయం వెనుక మాస్టర్ మైండ్..!!
తెలంగాణ కాంగ్రెస్ విజయంలో కీలక పాత్రధారి సునీల్. పార్టీ హైకమాండ్ - రేవంత్ తో సహా పార్టీ నేతలు పైకి కనిపిస్తుంటే..వారిని తన వ్యూహాలతో ముందుకు నడిపించింది సునీల్. కర్ణాటకలో పార్టీకి విజయం అందించిన సునీల్ పైనే కాంగ్రెస్ తెలంగాణ బాధ్యతలను అప్పగించింది. బీఆర్ఎస్ బలాలు- బలహీనతలు పూర్తిగా అధ్యయనం చేసిన సునీల్.. పార్టీ ఎన్నికల నినాదాలు..పథకాలతో సహా అభ్యర్దులు ఎంపిక.. ప్రచారం వరకు అన్నీ తానై వ్యవహరించారు. పార్టీని గెలుపు తీరాలకు చేర్చారు.
కలిసొచ్చిన సునీల్ వ్యూహాలు : సునీల్ కనుగోలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ టాస్క్ ఫోర్స్ సభ్యుడిగా పనిచేస్తున్నారు. ఈయన బళ్ళారిలో తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించారు. చెన్నైలో చదువుకున్నారు. అమెరికాలో ఏంబీఏ చేశారు. అక్కడే ఓ కన్సల్టెన్సీ సంస్థలో పనిచేశారు. అసోసియేషన్ ఆఫ్ బ్రిలియంట్ మైండ్స్ (ఏబీఎం) కు సహవ్యవస్థాపకుడిగా సునీల్ కనుగోలు రాజకీయ వ్యూహకర్త ప్రయాణం మొదలుపెట్టారు.

తొలుత బీజేపీ కోసం పని చేసారు. 2014లో నరేంద్రమోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేయడానికి ప్రశాంత్ కిషోర్ తీసుకువచ్చిన సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్ననెన్స్ (సీఏజీ)లో సునీల్ భాగస్వామిగా ఉన్నారు. అయితే 2022లో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నం చేశాక, సునీల్ కనుగోలు కూడా అదే పార్టీలో చేరారు.
పార్టీలో కీలకంగా మారి : బీజేపీతో తన అనుబంధానికి భిన్నంగా సునీల్ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యారు. 2022లో కాంగ్రెస్ పార్టీ కీలక ఎన్నికల వ్యూహకర్తగా నియమితులయ్యాక సోనియాగాంధీ ఈయనను 2024 లోక్‌సభ పోల్స్ టాస్క్ ఫోర్స్ సభ్యునిగా నియమించారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయంతో వ్యూహకర్తగా సునీల్ తన తొలి విజయాన్ని నమోదు చేసుకున్నారు.
ముఖ్యంగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య సీఎం సీటు కోసం ఉన్న పోటీ పార్టీపై ప్రభావం చూపకుండా జాగ్రత్త పడటంతో ఆయన విజయం సాధించార. కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బొమ్మైపై 40 శాతం కమీషన్ తీసుకుంటున్నారంటూ కర్ణాటక కాంట్రాక్టర్స్ అసోసియేషన్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా మార్చడంలో సునీల్ సఫలమయ్యారు.

పార్టీ గెలుపులో ప్రధాన పాత్ర : 'పేసీఎం' పేరుతో సామాన్యుల వరకు ఈ ప్రచారాన్ని తీసుకువెళ్ళారు. అలాగే అమూల్ వర్సెస్ నందినీ డెయిరీ వ్యవహారాన్ని కన్నడిగుల ఆత్మగౌరవంతో ముడిపెట్టడంతో సునీల్ వ్యూహాలు బలంగా పనిచేశాయి. అన్నింకంటే ముఖ్యంగా సామాన్యుడిని మెప్పించేలా కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోలో సునీల్ బృందం పాత్ర ఉంది. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ తదితర ప్రజాకర్షక పథకాల వెనుక సునీల్ ఉన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవగానే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సునీల్ కనుగోలును తన సలహాదారుగా నియమించుకుని కేబినెట్ ర్యాంక్ ఇచ్చారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ సామాన్యల మనసు గెలుచుకునేలా మేనిఫెస్టో రూపొందించడంలో సునీల్ పాత్ర ఉంది. సీఎం కేసీఆర్ బీజేపీతో కుమ్మక్కయ్యారని ప్రచారం చేసి, మైనార్టీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేలా చేయడంలోనూ సునీల్ సక్సెస్ అయ్యారు. చివరగా పార్టీ గెలుపులో సునీల్ సక్సెస్ అయ్యారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications