బీజేపీ నేతలతో భేటీపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ.. కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు అన్ని ప్రయత్నాలను చేస్తోంది. తాజాగా, రాజకీయాల్లో సీనియర్ నేతలుగా ఉన్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పలువురు బీజేపీ కీలక నేతలు కలిశారు.
బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో గురువారం ఖమ్మం చేరుకున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆ ఇద్దరు నేతలతో భేటీ అయ్యారు.

భేటీ అనంతరం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రమొస్తే అన్ని రకాలుగా మంచి జరుగుతుందని కలలు కన్న తెలంగాణ బిడ్డల ఆశలను సీఎం కేసీఆర్ తుంగలో తొక్కారని పొంగులేటి దుయ్యబట్టారు.
వ్యక్తిగత స్వార్థం కోసం పరిపాలన చేస్తున్న సీఎం కేసీఆర్‌ను గద్దె దించే అంశంలో అందరం ఏకం కావాలి. ఇదే విషయాన్ని అనేక వేదికలపై చెప్పాను. బీజేపీ ముఖ్య నాయకులతో చర్చల సందర్భంగా కూడా ఇదే విషయం చెప్పామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
ఏ లక్ష్యంతో తెలంగాణ బిడ్డలకు అండగా ఉండాలని బీఆర్ఎస్ నుంచి బయటికొచ్చామో.. ఆ ఆశయం నెరవేర్చే క్రమంలోనే ఈనాటి సమావేశం జరిగిందన్నారు. భవిష్యత్తులో జరగబోయే సమావేశాలు.. కేసీఆర్‌ను గద్దె దించడమే తమ అందరి లక్ష్యమని చెప్పారు.
తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే తమ నిర్ణయాలు ఉంటాయని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అయితే, బీజేపీలో చేరతామా? లేదా? అనేదానిపై మాత్రం ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.
మరోవైపు, మహబూబ్‌నగర్ నేత జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఇవాళ్టి సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. గతంలో చెప్పినట్లుగానే రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు, సంస్థలు, ఉద్యమకారులు, కళాకారులందరినీ సంఘటితం చేసి.. లక్ష్య సాధన కోసం ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల ద్వారా ప్రయత్నాలు చేస్తామన్నారు.
బీజేపీ ముఖ్య నేతలకు తాము చెప్పాల్సింది చెప్పామన్నారు. ఏ పార్టీలో చేరాలనేదానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇంకా చాలా మందితో మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉందని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రయత్నిస్తామని జూపల్లి స్పష్టం చేశారు. కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ ఇద్దరు నేతలు తమ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications