బీజేపీలోకి పొంగులేటి - నేడే ఖమ్మం వేదికగా..!?
మాజీ ఎంపీ పొంగులేటి చేరే పార్టీ పైన క్లారిటీ వచ్చేనట్లే కనిపిస్తోంది. పొంగులేటీ చేరే కొత్త పార్టీ పైన కొంత కాలంగా సస్పెన్స్ కొనసాగుతోంది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి తన అనుచర వర్గంతో మరో పార్టీ లో చేరేందుకు పొంగులేటి కొంత కాలంగా చర్చలు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని స్థానాల్లో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి తన బలం చాటుకొనే ప్రయత్నం చేసారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి ఆహ్వానం ఉంది. ఇప్పుడు బీజేపీలో ఎంట్రీ ఇచ్చేలా అడుగులు పడుతున్నాయి.
పొంగులేటితో బీజేపీలోకి ఎంట్రీ ఇస్తారా: వచ్చే ఎన్నికల్లో తన బలం చాటుకోవాలని మాజీ ఎంపీ పొంగులేటి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా అన్ని నియోజకవర్గాల్లోనూ తన అనుచర వర్గంతో సమావేశమయ్యారు. పార్టీ మార్పు పైన స్పష్టత ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకత్వతో తాను దూరం అవ్వటానికి కారణాలను వివరించారు. పొంగులేటి నిర్ణయంతో తామంతా కలిసి వస్తాయని దాదాపు అన్ని నియోజవకర్గాల్లోని నేతలు హామీ ఇచ్చారు. బీజేపీలో చేరుతారని చాలా కాలంగా ప్రచారం సాగుతున్నా పొంగులేటి ఆ విషయాన్ని నిర్ధారించలేదు. కాంగ్రెస్ , వైఎస్సార్టీపీ లో చేరిక పైన చర్చ లు జరిగాయి. పొంగులేటి ఏ పార్టీలో చేరాలనేది మాత్రం నిర్ణయం తీసుకోలేదు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన తరువాత పాంగులేటి, మాజీ మంత్రి జూపల్లని తమ పార్టీలోకి ఆహ్వానించటానికి కాంగ్రెస్ ..బీజేపీ రెండు పార్టీలు ప్రయత్నాలు చేసాయి.

ఖమ్మంకు బీజేపీ నేతలు: వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కాకుండా చేసే పార్టీలోకే వెళ్తానని పొంగులేటి ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్ధులను అసెంబ్లీ గేటు తాకనివ్వబోనని శపథం చేసారు. త్వరలోనే ఖమ్మం నగరంలో భారీ స్థాయిలోనే ఆత్మీయ సమ్మేళనానికి నిర్ణయించారు. ఈ సమయంలోనే గురువారం బీజేపీ లోకి పొంగులేటిని ఆహ్వానిచేందుకు ఆ పార్టీ ముఖ్య నేతలు నేడు ఖమ్మం వెళ్లనున్నారు. ఎమ్మెల్యే రఘునందనరావు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటుగా మరి కొందరు నేరుగా పొంగులేటితో భేటీ కానున్నారు. ఖమ్మం ఎంపీతో పాటుగా పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన మద్దతు దారులకు సీట్లు ఇవ్వాలనేది పొంగులేటి డిమాండ్ గా కనిపిస్తోంది. వారిని గెలిపించుకొనే బాధ్యత తనదేనని హామీ ఇస్తున్నారు.

అటు కాంగ్రెస్ ఇటు బేజేపీ: బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణలో చేరికలకు సంబంధించిన హామీల పైన రాష్ట్ర నాయకత్వానికి స్వేచ్చ ఇచ్చింది. ఈ క్రమంలో పొంగులేటితో భేటీ కీలకం కానుంది. కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి చెందిన ప్రతినిధులు సైతం ఇప్పటికే పొంగులేటితో చర్చలు జరిపారు. కానీ, రాష్ట్ర ..జిల్లా నాయకత్వం నుంచి సీట్ల కేటాయింపులో వచ్చిన అభ్యంతరాలతో నిర్ణయం పెండింగ్ లో పడింది. ఈ సమయంలో బీజేపీ నేతలు నేరుగా పొంగులేటితో చర్చల ద్వారా తమ పార్టీలోకి ఆహ్వానించాలని డిసైడ్ అయ్యారు. అటు జూపల్లితోనూ చర్చలు కొలిక్కి వచ్చాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. పొంగులేటితో చర్చలు ఫలిస్తే ఖమ్మంలోనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పొంగులేటి తన అనుచర వర్గంతో బీజేపీలో చేరుతారని చెబుతున్నారు. దీంతో, నేటి పరిణామాలు ఖమ్మం రాజకీయాల్లో కీలకంగా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications