ఎట్టకేలకు తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు అంగీకరించిన పూర్ణిమ
అనుకా శ్రీ(పూర్ణిమ సాయి) ఎట్టకేలకు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు అంగీకరించింది. ఈ మేరకు ఆమెను ఒప్పించినట్లు సైకాలజిస్టులు తెలిపారు. ఏదైనా ఆమె ఇష్ట ప్రకారమే జరుగుతుందని చెప్పారు.
హైదరాబాద్: అనుకా శ్రీ(పూర్ణిమ సాయి) ఎట్టకేలకు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు అంగీకరించింది. ఈ మేరకు ఆమెను ఒప్పించినట్లు సైకాలజిస్టులు తెలిపారు. ఏదైనా ఆమె ఇష్ట ప్రకారమే జరుగుతుందని చెప్పారు. ఆమె కోరుకుంటేనే తల్లిదండ్రులకు చేర్చడం జరుగుతుందన్నారు.

ఎట్టకేలకు అంగీకారం
అయితే, సీడబ్ల్యూసీనే తుది నిర్ణయం తీసుంటుందని వారు తెలిపారు. ప్రస్తుతం నగరంలోని ఓ జువైనల్ హోంలో ఆశ్రయం పొందుతున్న పూర్ణిమసాయిని బాలల హక్కుల అధికారులు, సైకాలజిస్టులు కలిశారు. ఆమె ఎందుకు ఇంటి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందనే దానిపై ఆరా తీశారు. వాళ్ల సూచనలతో పూర్ణిమ ఇంటికి వెళ్లేందుకు అంగీకరించినట్లు తెలిపారు.

అందుకే తల్లిదండ్రులకు దూరం..
సినిమాలపై ఆమెకు ఆసక్తి ఉందని అధికారులు చెప్పారు. తల్లిదండ్రుల ముఖం చూసినా, వారితో ఉన్నా వారికి అరిష్టమని, వారు చనిపోతారని తనకు కల వచ్చిందని, అందుకే తాను తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లడం లేదని పూర్ణిమ సాయి తెలిపిందని అధికారులు తెలిపారు. ప్రస్తుం ఆమెకు సైకాలజిస్టులు కౌన్సిలింగ్ ఇస్తున్నారని చెప్పారు.

ఎక్కువగా మాట్లాడటం లేదు..
పూర్ణిమసాయి నిర్ణయాన్ని గౌరవించాల్సిందేనని అన్నారు. బాలల హక్కుల అధికారి అంజన్ రావు మాట్లాడుతూ.. పూర్ణిమసాయి సాధారణ పరిస్థితిలోనే ఉందని చెప్పారు. ఆమె ఎక్కువగా మాట్లాడటం లేదని తెలిపారు.

తల్లిదండ్రులు ఇప్పటివరకు కలవలేదు..
పూర్ణిమను ఇప్పటి వరకు ఆమె తల్లిదండ్రులు కూడా కలవలేదని చెప్పారు. పాప సమస్యేమిటో తెలుసుకుంటున్నామని తెలిపారు. తల్లిదండ్రుల వద్దకు పంపాలా? వద్దా? అనే విషయంపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications