హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అశ్లీల సందేశాలు, మార్ఫింగ్ నగ్నఫోటోలు.. ఈజీ లోన్ యాప్స్; ట్రాప్ లో పడితే అంతే!!

|
Google Oneindia TeluguNews

ఇన్‌స్టంట్ లోన్ యాప్‌ల ఆగడాలు శృతి మించుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో లోన్ యాప్స్ నిర్వాహకులు బరితెగించి వేధింపులకు గురిచేస్తున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. రికవరీ ఏజెంట్ల నుంచి తీవ్రమైన వేధింపులను ఎదుర్కొంటున్నారు ఈ లోన్ యాప్ ల ద్వారా రుణాలు తీసుకున్న రుణ గ్రహీతలు. అనేక ఫిర్యాదుల నడుమ తాజాగా ఓ యువతికి అశ్లీల చిత్రాలు పంపించి వేధించిన లోని సిబ్బంది ఒకరిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు.

యువతి మొబైల్ కు అశ్లీల సందేశాలు, మార్ఫ్ చేసిన నగ్న ఫోటోలు.. ఫిర్యాదు చేసిన యువతి

యువతి మొబైల్ కు అశ్లీల సందేశాలు, మార్ఫ్ చేసిన నగ్న ఫోటోలు.. ఫిర్యాదు చేసిన యువతి

లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులను ఎదుర్కొంటూ గత కొన్ని నెలలుగా పలువురు వ్యక్తులు సహాయం కోసం హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ రుణం తీసుకొని కొన్ని వాయిదాలు లోన్ చెల్లించింది. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో లోన్ తిరిగి చెల్లించడంలో విఫలమైంది.

ఈ క్రమంలో రుణాల వసూళ్ల పేరుతో యువతి ఫోన్ కు వాట్సాప్ ద్వారా అసభ్యకరమైన మెసేజ్ లతో, ఆమె ఫోటోలను నగ్న ఫోటోలుగా మార్ఫ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బీహార్ కు చెందిన లోన్ యాప్ నిర్వాహకుడి అరెస్ట్

బీహార్ కు చెందిన లోన్ యాప్ నిర్వాహకుడి అరెస్ట్


దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అసభ్య మెసేజ్లతో వేధింపులకు పాల్పడుతున్న బీహార్‌కు చెందిన మనీష్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. సీడీఆర్ విశ్లేషణ ఆధారంగా పోలీసులు మనీష్ కుమార్ అసభ్యకరమైన మెసేజ్ లు పంపుతున్నట్టు నిర్ధారణ చేసుకున్న తర్వాత బీహార్ రాష్ట్రంలో ఉన్న అతనిని అరెస్టు చేశారు.

నిందితుడి ఫోన్ లో డేటా చూసి అవాక్కయిన పోలీసులు

నిందితుడి ఫోన్ లో డేటా చూసి అవాక్కయిన పోలీసులు


నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్‌లో డేటా చూసిన పోలీసులు షాక్ తిన్నారు. రుణం తీసుకున్న ఖాతాదారుల వివరాలతోపాటు వారి ఆధార్, పాన్ కార్డులు, నిందితులు మోసపోయిన కొంతమంది బాధితుల వివరాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మనీష్ కుమార్ బికినీ యాప్‌తో లోన్ యాప్ కస్టమర్ల ఫోటోలను నగ్న ఫోటోలతో మార్ఫింగ్ చేసేవాడని మరియు వాటిని బాధితుల కుటుంబం, బంధువులు మరియు ఇతర పరిచయాలకు పంపి, రుణం వసూలు చేసే సాకుతో వారి పరువు తీస్తానని వేధించేవాడని పోలీసులు తెలిపారు.

లోన్ యాప్స్ నిర్వాహకుల ఆగడాలకు పలువురి ఆత్మహత్య

లోన్ యాప్స్ నిర్వాహకుల ఆగడాలకు పలువురి ఆత్మహత్య


మనీష్ కుమార్‌పై IT చట్టం, 2008లోని సెక్షన్లు 66C, 66D, 66 మరియు 67, మరియు సెక్షన్లు 384 (దోపిడీకి శిక్ష), 420 (మోసం చేయడం మరియు నిజాయితీగా ఆస్తిని పంపిణీ చేయడం) మరియు 509 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. ఇటీవల కాలంలో ఈ తరహా బెదిరింపులు పెరిగిపోవడంతో లోన్ యాప్స్ నిర్వాహకుల ఆగడాలకు ఆరుగురు బలైపోయారు అని పోలీసులు చెబుతున్నారు. అనేక మంది పోలీస్ స్టేషన్ల బాట పడుతున్నారని వెల్లడిస్తున్నారు. లోన్ యాప్స్ పేరుతో రుణాల వసూళ్ల కోసం బాధితులను వేధింపులకు గురి చేస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెబుతున్నారు. కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు.

ఈజీ లోన్స్ అని ట్రాప్ .. ఆ తర్వాత చుక్కలే ..

ఈజీ లోన్స్ అని ట్రాప్ .. ఆ తర్వాత చుక్కలే ..


ఇక ఇన్స్టంట్ లోన్ యాప్‌ల విషయానికి వస్తే, ఈ యాప్ లు అధిక వడ్డీ రేట్లు మరియు ప్రాసెసింగ్ రుసుములతో సులభంగా మరియు నిమిషాల్లో లోన్‌లను అందించడం ద్వారా ప్రజలను ఆకర్షిస్తాయి. అయితే ఎవరైనా లోన్ తిరిగి చెల్లించ లేకపోతే రికవరీ పద్ధతులు దారుణంగా ఉంటాయి. డబ్బు తీసుకున్న వ్యక్తి యొక్క కాంటాక్ట్ లిస్ట్‌లోని వ్యక్తులకు మెసేజ్లు పంపడం మరియు కాల్ చేయడం, ఫోటోలు మార్ఫింగ్ చేయడం వంటి దారుణాలకు లోన్ యాప్స్ నిర్వాహకులు తెగబడుతున్నారు.

ఈజీ లోన్ యాప్స్ తో తస్మాత్ జాగ్రత్త

ఈజీ లోన్ యాప్స్ తో తస్మాత్ జాగ్రత్త


చాలా మంది బాధితులు లోన్ రికవరీ ఏజెంట్ల నుండి దోపిడీకి గురయినట్టు ఫిర్యాదు చేశారు. వారు బాధితుల ఫోటోలను నగ్న చిత్రాలుగా మార్ఫింగ్ చేస్తానని, వాటిని వారి కుటుంబాలు మరియు ఇతర పరిచయాలు లేదా పోర్న్ సైట్‌లలో పంచుకుంటామని తరచుగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే నిత్యం వారిపై ఫిర్యాదులు వెల్లువ గా మారుతున్నాయి. అందుకే పోలీసులు ఈజీ లోన్ యాప్స్ తో తస్మాత్ జాగ్రత్త అంటున్నారు.

English summary
Complaints have surfaced against operators of Easy Loan apps for harassing them with pornographic messages and morphed nude photos. Hyderabad police have recently arrested a loan app operator from Bihar in connection with the incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X