తప్పుచేశా, అందరికీ చెప్తా: కౌన్సెలింగ్ తర్వాత యాంకర్ ప్రదీప్, ఆ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: న్యూఇయర్ రోజున మద్యం మత్తులో పట్టుబడిన యాంకర్ ప్రదీప్ ఎట్టకేలకు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. ఆయన సోమవారం మధ్యాహ్నం సమయంలో గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. బేగంపేట ట్రాఫిక్ పీఎస్‌కు హాజరవుతారని అందరూ భావిస్తూ వచ్చారు.

  Anchor Pradeep's Latest Video Going Viral, Watch యాంకర్ ప్రదీప్ 'వివరణ' వీడియో వైరల్

  ఆయన కోసం మీడియా, సామాన్యులు, పోలీసులు వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బేగంపేటలో కాకుండా గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట హాజరయ్యారు. ప్రదీప్‌కు పోలీసులు మూడు డ్యాక్యుమెంటరీలు చూపించారు. అరగంట పాటు ఆయనకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయారు.

  కౌన్సెలింగ్ పూర్తయ్యాక

  కౌన్సెలింగ్ పూర్తయ్యాక

  కౌన్సెలింగ్ పూర్తయిన అనంతరం యాంకర్ ప్రదీప్ మాట్లాడారు. అరగంట పాటు ఆయనకు కౌన్సెలింగ్ ఇచ్చారు. తాగి వాహనం నడపవద్దని తాను ప్రచారం చేస్తానని చెప్పారు. తాను ఎవరినీ తప్పుదోవ పట్టించలేదన్నారు. ఆ రోజు అలా జరిగిపోయిందని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తనకు ఇచ్చిన సమయానికి కౌన్సెలింగ్‌కు వచ్చానని చెప్పారు. షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల రాలేకపోయానని చెప్పారు.

  నేను తప్పు చేశా, ఇక ఇలాంటి తప్పు చేయను

  నేను తప్పు చేశా, ఇక ఇలాంటి తప్పు చేయను

  నేను తప్పు చేశానని, ఇక ముందు ఇలాంటి తప్పు చేయనని ప్రదీప్ చెప్పారు. నేను పట్టుబడటం ఇదే మొదటిసారి అని చెప్పారు. తాను ఇక్కడకు రావడం ఇదే తొలిసారి అని చెప్పారు. తమలాంటి వారిని చూసి చాలామంది నేర్చుకుంటారని, కాబట్టి మేం ఇలాంటి తప్పులు చేయవద్దన్నారు. మీరు ఎన్నిసార్లు అక్కడ తిరిగి ఉంటారని విలేకరులు ప్రశ్నించగా.. అలా ఏమీ లేదన్నారు.

  నేను చేసిన తప్పు ఎవరూ చేయకూడదు

  నేను చేసిన తప్పు ఎవరూ చేయకూడదు

  నేను చేసిన తప్పు ఇక ఎవరూ చేయకూడదని యాంకర్ ప్రదీప్ అన్నారు. కేసు విషయమై కొందరిని కలిసి ప్రభావితం చేసే ప్రయత్నం చేశారనే ప్రచారం జరిగిందని విలేకరులు అడగగా.. అలాంటిదేమీ లేదని, తనకు షూటింగ్ ఉండటం వల్లే రాలేకపోయానని చెప్పారు. విలేకరులు ఆయనను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. మీ పక్కన యువతులు ఉన్నారని వార్తలు వచ్చాయని కూడా అడిగారు.

  తండ్రితో కలిసి కౌన్సెలింగ్‌కు హాజరు

  తండ్రితో కలిసి కౌన్సెలింగ్‌కు హాజరు

  యాంకర్ ప్రదీప్ తన తండ్రితో కలిసి గోషా మహల్ ట్రాఫిక్ పీఎస్‌లో కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. మద్యం తాగిన కేసులో బ్రీత్ అనలైజర్ టెస్టులో ప్రదీప్‌కు 178 పాయింట్లు వచ్చిన విషయం తెలిసిందే. సాధారణం కంటే ఆయన చాలా ఎక్కువ తాగినట్లు పోలీసులు గుర్తించారు. మద్యం తాగిన కేసులో ప్రదీప్‌కు ఏం శిక్ష పడుతుందా అనే చర్చ సాగుతోంది. దాంతో పాటు ఆయనపై కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం వేసిన కేసు కూడా నమోదయింది. ఆయనకు ఒకటికి రెండు కేసులు తోడయ్యాయి.

  చాలా విషయాలు తెలుసుకున్నా, పోలీసులు బాగా చెప్పారు

  చాలా విషయాలు తెలుసుకున్నా, పోలీసులు బాగా చెప్పారు

  ఈ రోజు కౌన్సెలింగ్‌ సెషన్‌కు హాజరు కావాలని మెసేజ్‌ వచ్చిందని, అందుకే వచ్చానని, ఇప్పటివరకు రాలేదంటని అంతా అనుకుంటున్నారని, తప్పించుకుంటున్నానని, అజ్ఞాతంలోకి వెళ్లానని రకరకాలుగా అంటున్నారని, అలాంటిదేమీ లేదని ప్రదీప్ చెప్పారు. పోలీసులు తనకు కేటాయించిన తేదీలో వచ్చానని, నిబంధనలను ఫాలో అవుతున్నానని, ఈ కౌన్సెలింగ్‌ ద్వారా నేను చాలా విషయాలు తెలుసుకున్నానని, పోలీసులు చాలా ఓపికతో బాగా వివరించారని చెప్పారు. మద్యం తాగడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? డ్రైవింగ్‌ చేయడం వల్ల ప్రమాదాలకు గురయ్యేందుకు అవకాశాలు తదితర అంశాలను అర్థమయ్యేలా చెప్పారన్నారు. నిబంధనల ప్రకారం తదుపరి వాటికి హాజరవుతానని చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Anchor Pradeep attended for counselling at Goshamahal traffic police station on Monday afternoon.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X