హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రత్యూషను కలిసి వివరాలు అడిగిన ఎస్‌జీపీ, విశ్రాంత జడ్జి మరో లేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురై, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూష(19)ను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ప్రత్యూష వ్యవహారంలో లోతైన అధ్యయనం తర్వాతే ఆ యువతి భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తామని హైకోర్టు తెలిపింది. ఆ యువతి శారీరకంగా ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్లు తాము భావించడంలేదని, తదుపరి ఉత్తర్వుల వరకు ఆసుపత్రిలోనే ఉండేలా చూడాలని తెలిపింది.

ఎస్‌జీపీ స్వయంగా ఆ యువతి దగ్గరకు వెళ్లి మాట్లాడాలని సూచించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది (ఎస్‌జీపీ) ప్రత్యూషను ఆసుపత్రిలో పరామర్శించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు.

ఇదిలా ఉండగా, వేధింపులకు గురైన ప్రత్యూష వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఒకరు మరో లేఖ రాశారు. దానిని హైకోర్టు పరిగణలోకి తీసుకొని విచారణ జరుపుతామని తెలిపింది.

ప్రత్యూషను సవతి తల్లి చాముండేశ్వరి చిత్రహింసలకు గురి చేయగా, తండ్రి రమేష్ ఏమీ అనేవాడు కాదు. ఆమె ఇటీవల విముక్తురాలైంది. దీనిని పత్రికల్లో చూసిన న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది. ఆమె సంరక్షణ కోసం పెదనాన్నను కోర్టులో ప్రవేశ పెట్టాలని సూచించింది. ప్రత్యూష కన్నతల్లి అక్క సరళ. ఆమె భర్త సతీష్ చంద్ర. ఆయన డిప్యూటీ కలెక్టర్.

ప్రత్యూష

ప్రత్యూష

హైదరాబాదులోని ఎల్బీ నగర్ అవేర్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను కలిసి వివరాలు తెలుసుకున్న అడ్వోకేట్ జనరల్ దృశ్యం

ప్రత్యూష

ప్రత్యూష

హైదరాబాదులోని ఎల్బీ నగర్ అవేర్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను కలిసి వివరాలు తెలుసుకున్న అడ్వోకేట్ జనరల్ దృశ్యం

ప్రత్యూష తండ్రి

ప్రత్యూష తండ్రి

ప్రత్యూష సవతి తల్లి ఆమెను వేధించేది. ప్రత్యూష కన్న తండ్రి వారించేవాడు కాదు. చూస్తూ కూర్చునేవాడు. అతనిని 15వ తేదీన అరెస్టు చేసిన పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టారు.

ప్రత్యూష తండ్రి

ప్రత్యూష తండ్రి

ప్రత్యూష సవతి తల్లి ఆమెను వేధించేది. ప్రత్యూష కన్న తండ్రి వారించేవాడు కాదు. చూస్తూ కూర్చునేవాడు. అతనిని 15వ తేదీన అరెస్టు చేసిన పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టారు.

ప్రత్యూష తండ్రి

ప్రత్యూష తండ్రి

ప్రత్యూష సవతి తల్లి ఆమెను వేధించేది. ప్రత్యూష కన్న తండ్రి వారించేవాడు కాదు. చూస్తూ కూర్చునేవాడు. ప్రత్యూష సంరక్షణ బాధ్యతను పెదనాన్నకు అప్పగించే అవకాశముంది.

ప్రత్యూష

ప్రత్యూష

హైదరాబాదులోని ఎల్బీ నగర్ అవేర్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూష దృశ్యం.

ప్రత్యూష

ప్రత్యూష

హైదరాబాదులోని ఎల్బీ నగర్ అవేర్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిశారు.

ప్రత్యూష

ప్రత్యూష

హైదరాబాదులోని ఎల్బీ నగర్ అవేర్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిశారు.

English summary
Prathyusha Case Trial in High Court
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X