ప్రవల్లిక ఆత్మహత్య: నివేదిక కోరిన గవర్నర్; బందోబస్తు మధ్య ప్రవల్లిక అంత్యక్రియలు!!
హైదరాబాద్ అశోక్ నగర్ లో వరంగల్ కు చెందిన మర్రి ప్రవల్లిక ఆత్మహత్య చేసుకుంది. గ్రూప్ టు ఉద్యోగం కోసం కష్టపడి చదువుతున్న ఆమె గ్రూప్-2 పరీక్ష వాయిదా పడడంతో తీవ్ర నిరాశ చెంది సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం ప్రవల్లిక ఆత్మహత్యకు పాల్పడడంతో విద్యార్థులు భారీగా మోహరించి ఆందోళన చేపట్టారు. ప్రవల్లిక మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకుని ఈ చావుకు బాధ్యులెవరు అంటూ ప్రశ్నించారు.
దీంతో విద్యార్థులకు పోలీసులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. భారీ బందోబస్తు మధ్య ప్రవల్లిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆమె మృతదేహాన్ని నేడు ఆమె స్వగ్రామమైన వరంగల్ జిల్లాలోని బిక్కాజి పల్లికి బందోబస్తు మధ్య తరలించారు. బిక్కాజి పల్లి లో ప్రవల్లిక అంత్యక్రియలు నేడు కొనసాగుతున్నాయి.

ప్రవల్లిక మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. విద్యార్థుల ఆందోళనల మధ్య పోలీసులు బిక్కాజి పల్లిలో భారీగా మొహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అంత్యక్రియలను కొనసాగిస్తున్నారు. ప్రవల్లిక అంత్య క్రియల్లో భారీగా విద్యార్థులు పాల్గొంటున్నారు.
ఇక గ్రూప్-2 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వరంగల్ జిల్లాకు చెందిన ప్రవల్లిక ఆత్మహత్యపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, TSPSC కార్యదర్శి లను రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ ఆదేశించారు. ప్రవల్లిక ఆత్మహత్య పట్ల తీవ్ర బాధను వ్యక్తం చేసిన గవర్నర్... ఆమె కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు.
గవర్నర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన మేరకు, ప్రవల్లిక మరణం యువతరం, ముఖ్యంగా నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సవాళ్ళను ఎత్తి చూపుతోందని గవర్నర్ అన్నారు. ప్రవల్లిక గ్రూపు II పరీక్షలకు సిద్ధం అవుతున్న విషయం గవర్నర్ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఈ పరీక్షలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాయిదా వేసిన క్రమంలో చోటు చేసుకున్న యువ ఉద్యోగార్ది ప్రవల్లిక ఆత్మహత్యపై ఇప్పుడు గవర్నర్ దృష్టి సారించారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications