'నిజాం విదేశీయుడు, ఇప్పుడు 'ఐసిస్' ఏం చేస్తుందో నాడే రిజ్వీ చేశాడు'
హైదరాబాద్: నిజాం పూర్వీకులు బాబరు, ఔరంగజేబు దేవాలయాల విధ్వంసకులు అని, నిజాం భావాలు ఔరంగజేబులాంటివేనని, నిజాం విదేశీయుడని విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియా బుధవారం నాడు అన్నారు.
భాగ్యనగరంలోని బంజారాహిల్స్‌లో హిందూ బంధం సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవం - హిదూ ఐక్యతపై ఆయన మాట్లాడారు. స్వాతంత్రం వచ్చాక సంస్థానాలు పాకిస్తాన్‌లోనో, హిందూస్తాన్‌లో గాని కలపవచ్చని బ్రిటిష్ పన్నిన కుటిల పన్నాగంతో హైదరాబాద్ సంస్థానాన్ని ముస్లీంస్థాన్‌గా మార్చాలని నిజాం ఆలోచించాడని విమర్శించారు.

ఈ రోజు సిరియాలో ఐసిస్ ఏం ప్రకటిస్తుందో ఆ రోజు రిజ్వీ అదే ప్రకటించాడన్నాడు. జిహాదీ పేరిట హిందూవాదంపై యుద్ధం ప్రకటించే నాటి, నేటి వాతావరణాల మధ్య తేడా ఏమీ లేదన్నారు. బాబర్, ఔరంగజేబు వారసులకు ఈ దేశం లొంగదన్నారు.
నిజాం విదేశీయుడని, ఆయన పూర్వీకులు బాగ్దాద్(ఇరాక్)కు చెందిన వారన్నారు. హైదరాబాద్ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు తెలంగాణ సర్కారు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రవీణ్ తొగాడియా విజ్ఞప్తి చేశారు.
-
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..?












Click it and Unblock the Notifications