ప్రయాగ్‌రాజ్ విమానం 5 గంటలు ఆలస్యం, ప్రయాణికుల్లో విజయ్ దేవరకొండ

Hyderabad: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మహా కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్​రాజ్ వెళ్లాల్సిన విమానం ఐదున్నర గంటలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. శుక్రవారం ఉదయం 10.30కు ప్రయాగ్​రాజ్ వెళ్లాల్సిన విమానం ఐదున్నర గంటలు ఆలస్యమైంది.

Prayagraj flight delay Passengers Agitated At shamshabad Airport

ఈ క్రమంలో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఐదు గంటలుగా విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా విమానం సాయంత్రం 4 గంటలకు వెళ్తుందని యాజమాన్యం తెలిపింది. దీంతో ఐదుగంటల ఆలస్యంగా విమానం బయల్దేరింది.

Prayagraj flight delay Passengers Agitated At shamshabad Airport

కాగా, విమాన ప్రయాణికుల జాబితాలో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో పాటు ఇద్దరు ఐఏఎస్, 8 మంది ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు. ఎట్టకేలకు ఐదుగంటల తర్వాత విమానం ప్రయాగ్ రాజ్ బయల్దేరడంతో ప్రయాణికులు ఊరట చెందారు. వీరంతా కుంభమేళాకు వెళ్లినట్లు తెలుస్తోంది.

మహా కుంభమేళాలో 40 కోట్ల మంది పుణ్యస్నానాలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని త్రివేణి సంమంలో జనవరి 13 నుంచి కొనసాగతున్న మహా కుంభమేళా అధికారికంగా ఫిబ్రవరి 26న ముగియనుంది. ప్రతి రోజు లక్షల మందిలో భక్తులు గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 40 కోట్ల మంది భక్తులు నదీ స్నానాలు ఆచరించారు.

కాగా, కుంభమేళాకు ఆధ్యాత్మిక పరిమళాన్ని అద్దిన 13 అఖాడాల సాదువులు క్రమంగా తిరుగుముఖం పడుతున్నారు. దీనికి సూచికగా ఆయా అఖాడాల ధర్మ ధ్వజాలను వారు అవనం చేశారు. గత సోమవారం నాటి వసంత పంచమితో తుది అమృత స్నానం ముగిసినందున సంప్రదాయబద్ధమైన కఢీ పకోడా విదుతో సాదువులు తమ స్థావరాకు తిరుగుపయనమవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+