తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగులకు తీపికబురు
హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాంస్కృతిక, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్సీ 2020 ప్రకారం తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయనున్నారు.
పెంచిన పీఆర్సీ 2021, జూన్ 1 నుంచి వర్తింపజేస్తారు. పీఆర్సీ అమలుకు చర్యలు తీసుకోవాలని భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. మూడు నెలల క్రితం టీఎస్ఎస్ ఉద్యోగుల పీఆర్సీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదంతో సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ సాంస్కృతిక సారథిలో మొత్తం 583 ఉద్యోగులు ఉన్నారు. పేస్కేల్‌పై 30 శాతం పీఆర్సీ అమలు చేయనున్నారు. దీంతో ఉద్యోగులకు రూ. 7300 మేర జీతాలు పెరిగే అవకాశం ఉంది.
తెలంగాణలో మరో రెండు కొత్త మండలాలు.. నోటిఫికేషన్ విడుదల
రాష్ట్రంలో మరో రెండు మండలాలను, కొత్తగా ఒక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఎర్రవల్లిని మండలంగా ప్రకటిస్తూ ఇప్పటికే ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసి అభిప్రాయాలను సేకరించింది.
తాజాగా అందుకు సంబంధించి తుది నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఇక, కామారెడ్డి జిల్లాలోని మహమ్మద్‌నగర్‌ను నూతన మండలంగా, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కీసర మండలంలోని బొగారం గ్రామ పరిధిలో ఉన్న బార్సిగూడను నూతన రెవెన్యూ గ్రామంగా ఏర్పాటుచేస్తూ ప్రాథమిక నోటిఫికేషన్లను విడుదల చేసింది. వీటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఆ నోటిఫికేషన్లలో పేర్కొంది.












Click it and Unblock the Notifications