ప్రీతి ఆత్మహత్యకు ఆ 50లక్షల బాండ్ కారణమా? ప్రీతికేసులో వెలుగులోకి మరో సంచలనం

ప్రీతి ఆత్మహత్యకు మెడికల్ పీజీ సీటు కోసం 50 లక్షల బాండ్ కూడా ఒక కారణమా? అన్న చర్చ జరుగుతుంది.

కాకతీయ మెడికల్ కాలేజ్ పీజీ వైద్య విద్యార్థిని మృతి కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తుంది. ఇక తాజాగా సీనియర్ విద్యార్థి వేధింపులు భరించలేక మాత్రమే కాదు, ఆ యాభై లక్షల రూపాయల బాండ్ కూడా ప్రీతి మృతికి కారణమని కొత్త విషయం తెరమీదకు వచ్చింది. ఇంతకీ 50 లక్షల రూపాయల బాండ్ ఏంటి? అసలు ప్రీతి మృతికి ఈ బాండ్ కు సంబంధం ఏంటి? అంటే

ప్రీతి ఒత్తిడి వెనుక 50 లక్షల బాండ్

ప్రీతి ఒత్తిడి వెనుక 50 లక్షల బాండ్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి సీనియర్ విద్యార్థి వేధింపులు భరించలేక ఒత్తిడికి గురైందని తల్లిదండ్రులు, పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ప్రీతీ ఒత్తిడి వెనుక కళాశాల యాజమాన్యం తీసుకునే 50 లక్షల రూపాయల బాండ్ కూడా కారణమని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలు ఈ 50 లక్షల రూపాయల బాండ్ కథ ఏమిటి అంటే ..

 అడ్మిషన్ బాండ్ క్రింద 50 లక్షల రూపాయల అగ్రిమెంట్

అడ్మిషన్ బాండ్ క్రింద 50 లక్షల రూపాయల అగ్రిమెంట్


వైద్య విద్యలో పీజీ సీటు వచ్చిన సమయంలో అడ్మిషన్ బాండ్ కింద 50 లక్షల రూపాయల అగ్రిమెంట్ పై సంతకం చేయాల్సి ఉంటుంది. అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఒకవేళ మరే ఇతర కారణాలతోనైనా కోర్సును మధ్యలో వదిలేస్తే విశ్వవిద్యాలయానికి 50 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా బాండ్ తీసుకుంటే అత్యంత ప్రతిష్టాత్మకమైన వైద్య విద్యా కోర్సును విద్యార్థులు ఎవరూ మానుకోరని భావించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ప్రీతిపై మరింత ఒత్తిడిని పెంచిందని, ఆమె పాలిట శాపంగా మారిందని భావిస్తున్న వారు లేకపోలేదు.

 చదువు మానేస్తే యూనివర్సిటీకి 50 లక్షలు కట్టాల్సిందే

చదువు మానేస్తే యూనివర్సిటీకి 50 లక్షలు కట్టాల్సిందే


సీనియర్ల ఒత్తిడిని తట్టుకోలేక ఒకవేళ పీజీ కోర్సు మానేద్దామని భావించినప్పటికీ ప్రీతి మానేయలేని పరిస్థితి అక్కడ బాండ్ వల్ల కలిగిందని భావిస్తున్నారు. గత సంవత్సరం పీజీ మెడికల్ సీటు మధ్యలో వదిలేస్తే 20 లక్షలు చెల్లించాలని నిబంధన ఉండేది. అయితే చాలామంది వైద్య విద్యార్థులు మెడికల్ పీజీ కోర్సులను మధ్యలోనే వదిలేస్తున్న కారణంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆ మొత్తాన్ని 50 లక్షల రూపాయలకు పెంచింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఒకవేళ ఈవైనా ఇబ్బందులతో చదువు వద్దు అనుకున్న విద్యార్థులు కూడా, చదువు వదిలి వెళ్ళలేని పరిస్థితి మెడికల్ కళాశాలలలో ఉందని తెలుస్తుంది.

ఆ డబ్బు తన తండ్రి కట్టలేడని వేదనకు గురైన ప్రీతి అఘాయిత్యం

ఆ డబ్బు తన తండ్రి కట్టలేడని వేదనకు గురైన ప్రీతి అఘాయిత్యం


ఇక మెడికల్ కళాశాలలో ర్యాంగింగ్ ఉన్నా, ఇతరత్రా ఇబ్బందులు ఉన్నా కోర్సుకు స్వస్తి చెప్పి బయటకు రాలేని పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందని చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే సీనియర్ల ఒత్తిడి తట్టుకోలేని ప్రీతి, అందులో నుంచి బయటపడలేని పరిస్థితి. ఒకవేళ చదువు మానేద్దామని భావించిన 50 లక్షల రూపాయలు యూనివర్సిటీకి చెల్లించాలంటే అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి తన తండ్రి కడతాడని ప్రీతి తీవ్ర ఒత్తిడికి, మనోవేదనకు గురైందని అంటున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం మెడికల్ పీజీ విద్యార్థులకు ప్రభుత్వం తప్పనిసరి చేసిన యాభై లక్షల బాండ్ విషయంలో చర్చ జరుగుతుంది. ఈ కోణంలో కూడా ఈ కేసును దర్యాప్తు చెయ్యాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+