ప్రీతి మృతి కేసు టాక్సికాలజీ రిపోర్ట్‌లో దిమ్మతిరిగే విషయం; హుటాహుటిన డీజీపీ వద్దకు సీపీ!!
కేఎంసీ పీజీ వైద్యవిద్యార్థిని ప్రీతి మృతి కేసులో పోలీసులు చేతికి చేరిన టాక్సికాలజీ రిపోర్ట్ కేసును కీలక మలుపు తిప్పనుంది. ఈ కేసు విషయంలో వరంగల్ సీపీ డీజీపీని కలవనున్నట్టు తెలుస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రీతి మృతి కేసులో ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఇంతకాలం ప్రీతి సీనియర్ మెడికో వేధింపులు భరించలేక హానికరమైన ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని భావిస్తే తాజాగా వచ్చిన టాక్సికాలజీ రిపోర్టులు షాకింగ్ విషయాన్ని వెల్లడించాయి. దీంతో పోలీసులకు ప్రీతి మృతి కేసు ఒక ఛాలెంజ్ గా తయారైంది.

ప్రీతి మృతి కేసులో షాకింగ్ పరిణామం .. దిమ్మతిరిగేలా చేసిన టాక్సికాలజీ రిపోర్ట్
తాజాగా పోలీసులు చేతికి చేరిన టాక్సీకాలజీ రిపోర్టు ఈ కేసు మొత్తాన్ని కీలకమైన తిప్పబోతుందని తెలుస్తుంది. టాక్సీకాలజీ రిపోర్టు దెబ్బకు వరంగల్ సీపీ రంగనాథ్ ఈరోజు హైదరాబాద్లోని పోలీస్ బాస్ వద్దకు వెళ్లి దీనిపై చర్చించనున్నట్లు సమాచారం. అసలు ఇంతకీ ప్రీతి మృతి కేసులో టాక్సీకాలజీ రిపోర్టులో ఏం తేలిందంటే... ప్రీతి శరీరంలో ఎటువంటి విష పదార్థాలు కానీ, ఎలాంటి రసాయనాలు కానీ లేవని రిపోర్ట్ లో పేర్కొన్నారు. ప్రీతి గుండె, కాలేయం తో పాటు పలు అవయవాలను, ప్రీతి రక్తాన్ని పరిశీలించిన వైద్యులు అందులో ఎటువంటి విష పదార్థాలు దొరకలేదని వెల్లడించారు. ఇప్పుడు ఇదే ప్రీతి మరణం పై అనేక అనుమానాలకు కారణంగా మారింది.

ప్రీతి మృతి కేసు మిస్టరీగా..
ఇన్ని రోజులు ఆత్మహత్య కేసుగా పరిగణించిన పోలీసులు ఈ కేసును తాజా టాక్సికాలజీ రిపోర్టుతో అనుమానాస్పద మృతి కేసుగా మార్చే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఇదిలా ఉంటే తాజా రిపోర్టుతో ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిందా? లేక హత్య చేశారా? అన్న విషయంలో పోలీసులు ఎటు తేల్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు. మొదటినుంచి ప్రీతీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, ప్రీతి ఆత్మహత్య చేసుకోలేదని, ఆమెది హత్య నని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రీతి స్పృహలో లేనప్పుడు ప్రీతి ఫోన్లో పాయిజన్ ఇంజక్షన్ కోసం వెతికినట్టు సీన్ క్రియేట్ చేసి, కేసును తప్పుదారి పట్టించారంటూ తల్లిదండ్రులు ఆరోపించారు.

టాక్సికాలజీ రిపోర్ట్ తో ప్రీతి కేసులో కీలక పరిణామం
ఇది కచ్చితంగా హత్యనని, నిరూపించడానికి కావలసిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తల్లిదండ్రులు పదేపదే చెప్పారు. ఇక తాజాగా వచ్చిన టాక్సికాలజీ రిపోర్టు కూడా ప్రీతి మృతి పై అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే ఈ కేసులో నిందితుడిగా ఉన్న సైఫ్ హోం మంత్రికి సమీప బంధువు అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, తాజాగా ఈ కేసులో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నది రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

సైఫ్ కస్టడీ పూర్తి, కీలక విషయాలు రాబట్టిన పోలీసులు.. నేడు డీజీపీ వద్దకు సీపీ
కాగా సైఫ్ ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు గురువారం నుండి ఆదివారం వరకు నాలుగు రోజుల పాటు సైఫ్ ను విచారించి కీలక విషయాలను రాబట్టారు. సైఫ్ తో పాటుగా వాట్సప్ గ్రూపులలో, వాట్సాప్ లో సైఫ్ తో ప్రీతి గురించి మాట్లాడిన జూనియర్, సీనియర్ మెడికో లను సైతం పోలీసులు విచారించారు. మరోపక్క ఈ కేసుకు సంబంధించి యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారణ కూడా జరుగుతుంది. ఇక ఇదే సమయంలో తాజాగా బయటకు వచ్చిన టాక్సీకాలజీ రిపోర్ట్ ఈ కేసులో ఊహించని మలుపుకు కారణమైంది. అసలు ఈ కేసులో డిజిపిని, సిపి ఎందుకు కలవడానికి వెళుతున్నాడు? కేసులో ఏం జరగబోతుంది? వంటి అనేక అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.












Click it and Unblock the Notifications