Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రీతి మృతి కేసు: కోర్టులో సైఫ్ కు చుక్కెదురు; కేటీఆర్ ను కలిసిన ప్రీతి తల్లిదండ్రులు!!

ప్రీతి మృతి కేసు నిందితుడు సైఫ్ కు కోర్టులో చుక్కెదురైంది. కేటీఆర్ ను కలిసిన ప్రీతి తల్లిదండ్రులు న్యాయం చెయ్యాలని కోరారు. అండగా ఉంటామని కేటీఆర్ చెప్పారు.

ప్రీతి మృతి కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కాకతీయ మెడికల్ కళాశాల పిజి వైద్య విద్యార్థిని ప్రీతి మృతి కేసులో ప్రీతిని తాను ర్యాగింగ్ చేసినట్టు నిందితుడు సైఫ్ పోలీసులు విచారణలో వెల్లడించినట్టు సమాచారం. ఇక ఇదే క్రమంలో ప్రీతి మృతికేసుకు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్, టాక్సీకాలజీ రిపోర్ట్ పోలీసుల చేతిలో ఉన్న క్రమంలో ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో ఏం జరుగుతుంది అన్నది ప్రస్తుతం ఉత్కంఠను రేకెత్తిస్తుంది.

సైఫ్ కు బెయిల్ పిటీషన్ కొట్టివేత
ఇదిలా ఉంటే ఇప్పటికే సైఫ్ ను నాలుగు రోజులపాటు విచారించిన పోలీసులు, మరో నాలుగు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే కోర్టు పోలీసుల విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఇక ఇదే సమయంలో గత నెల 28వ తేదీన సైఫ్ ఈ కేసులో తనకు బెయిల్ కావాలని కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై విచారణ జరిపిన ఉమ్మడి వరంగల్ జిల్లా న్యాయస్థానం సైఫ్ బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.

Preethi death case updates: court rejected bail to saif; preethi parents met ktr

పోలీసుల అదనపు కస్టడీ పిటీషన్ కొట్టివేత
ఇక ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేసిన పోలీసులకు సైతం కోర్టులో చుక్కెదురైంది. రెండు గంటలకు పైగా సుదీర్ఘ వాదనల అనంతరం అటు సైఫ్ బెయిల్ పిటిషన్ ను, ఇటు పోలీసుల కస్టడీ పిటీషన్ ను జడ్జి సత్యేంద్ర తిరస్కరించారు. బాధితులు నేరుగా కోర్టుకు విన్నవించే అవకాశం ఉండడంతో ప్రీతి తండ్రి నరేందర్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఎం. సత్యనారాయణ గౌడ్ ను కలిశారు. ఆయన కేసు పురోగతిపై, తనకు ఉన్న పలు సందేహాలపై డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సత్యనారాయణ గౌడ్ తో చర్చించారు.

Preethi death case updates: court rejected bail to saif; preethi parents met ktr

మంత్రి కేటీఆర్ ను కలిసిన ప్రీతి కుటుంబం.. అండగా ఉంటామన్న మంత్రి
ఇదిలా ఉంటే ఇటీవల మృతి చెందిన కాకతీయ వైద్య కళాశాల పీజీ విద్యార్థిని ప్రీతి మృతి పై తమకు న్యాయం చేయాలని ప్రీతి తల్లిదండ్రులు మంత్రి కేటీఆర్ ను కలిశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో వారు నిన్న కేటీఆర్ ను కలిశారు. పాలకుర్తి నియోజకవర్గం లోని గిరిజన తండా ప్రీతి స్వగ్రామం కావడంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక ఎమ్మెల్యే సహాయంతో ప్రీతి తల్లిదండ్రులు కేటీఆర్ ను కలిసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ప్రీతి చిత్రపటానికి కేటీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రీతి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి, తల్లిదండ్రులను మంత్రి కేటీఆర్ ఓదార్చారు.

Preethi death case updates: court rejected bail to saif; preethi parents met ktr
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+