పెళ్లికి ముందే గర్భవతి.. అబార్షన్ వికటించటంతో ప్రియుడి దారుణం ..గర్భిణీ దహనం కేసు

హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై రంగంపల్లి గేటు సమీపంలో ఓ మహిళ మృతదేహం పూర్తిగా కాలిపోయిన ఘటనలో మిస్టరీని ఛేదించారు పోలీసులు . రోడ్డు పక్కన ఉన్న గుంతలో పూర్తిగా కాలిపోయిన ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించటంతో దర్యాప్తు చేసిన పోలీసులు ఈ కేసులో పలు కీలక విషయాలు వెల్లడించారు .

గత కొద్ది రోజుల క్రితం వికారాబాద్ జిల్లాలో ఓ మహిళ సగం కాలిన మృతదేహం లభించిన సంగతి కలకం రేపింది . అయితే ఈ కేసులో పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రం కలబుర్గి ప్రాంతానికి చెందిన ఇస్తేరాణి శిభ అనే 22 ఏళ్ళ యువతీ డిగ్రీ సెంకడ్ ఇయర్ చదువుతోంది. ఆమె గత కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమించింది. పెళ్లికి ముందే ఇద్దరూ తొందరపడటంతో ఆమె గర్భం దాల్చింది. గర్భం వచ్చిన విషయం లేట్ గా గమనించిన వారు ఆరు నెలలు కావడంతో ఇంట్లో తెలిస్తే గొడవలు జరుగుతాయని కంగారుపడ్డారు.

 pregnanat woman burnt mistery revealed by police

దీంతో ఆమెకు అబార్షన్ చేయించాలని నిర్ణయం తీసుకుని యువతికి అబార్షన్ చేయించడానికి ప్రయత్నించారు.కుల్బర్గిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అబార్షన్ చేయించారు. అయితే అబార్షన్ వికటించి ఆమె చనిపోయింది. ఈ క్రమంలోనే ప్రియుడే ఆమెను అక్కడ కాల్చేసినట్లు పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు.

వైద్యం వికటించడంతో ఆమె చనిపోయింది కాబట్టి ఆమె ప్రాణాలు పోయిందని తెలిస్తే కేసు తనకు చుట్టుకుంటుందని ఆమె ప్రేమికుడు కంగారుపడి దీంతో ఆమె మృతదేహాన్ని తీసుకొని కారులో తీసుకువచ్చిహైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై రంగంపల్లి గేటు సమీపంలో పెట్రోల్ పోసి తగలపెట్టాడు. కాగా కాలిన శవం కనపడటంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సవాల్ గా తీసుకున్న పోలీసులు త్వరిత గతిన కేసును ఛేదించారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+