ఖమ్మంలో గర్భిణికి దారుణ అనుభవం: నిలబడే ప్రసవం, శిశువు మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో శనివారం సాయంత్రం నాగమణి అనే నిండు గర్భిణి పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చింది. డెలివరీకి 20వ తేదీ సమయం ఇచ్చారు. నొప్పులు అలాగే వస్తాయని డాక్టర్లు చెప్పారు.

నొప్పుల బాధ ఎక్కువ అవుతుందని చెప్పినా వారు పట్టించుకోలేదు. పడకలు ఖాళీ లేవంటూ ఓ బల్లపై కూర్చోబెట్టారు. తనను చూడాలని డాక్టర్లు, నర్సులకు చెప్పినా పట్టించుకోలేదని అంటున్నారు.

Pregnant woman forced to deliver baby on table

అర్ధరాత్రి నొప్పులు పెరిగాయి. చుట్టూ ఎవరూ లేరు. ఎవరైనా సాయం చేస్తారేమోనని లోపలకు వెళ్లేందుకు బల్లపై నుంచి కిందకు దిగింది. ఆమె అలా నిల్చొని ఉండగానే ప్రసవం అయింది.

అప్పుడు అక్కడకు వచ్చిన వైద్యులు శిశువుకు వైద్యం అందించారు. అయినా శిశువు నేలకు తాకడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. వైద్యులు, సిబ్బందిపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ థియేటర్ ఎదుట ఆందోళన చేపట్టారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Pregnant woman forced to deliver baby on table in Khammam hospital on Sunday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X