Narendra Modi: కాంగ్రెస్, బీఆర్ఎస్‍పై నిప్పులు చెరిగిన ప్రధాని మోడీ..

మహబూబ్ నగర్ లో పర్యటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. ప్రజాగర్జన బహిరంగ సభలో పాల్గొన్న మోడీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పై విరుచుకపడ్డారు. రెండు కుటుంబ పార్టీలు తెలంగాణ అభివద్ధిని అడ్డుకుంటున్నాయని అన్నారు. రాజకీయ పార్టీలని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మార్చారని విమర్శించారు. పార్టీ పదవుల్లో కుటుంబ సభ్యులే ఉంటారని ఎద్దేవా చేశారు. మిగతా పోస్టుల్లో అవసరాలకు ఇతరులను నియమిస్తున్నారని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ కారు స్టీరింగ్ మరో పార్టీ చేతిలో ఉందన్నారు. తెలంగాణలో మోడీ ఇచ్చే గ్యారంటీలకు తెలంగాణ ప్రజలకు నమ్మకం ఉంటుందన్నారు. మోడీ హామీ ఇస్తే నెరవేరుతుందన్న నమ్మకం ప్రజల్లో ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ హస్తకళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రధాని గుర్తు చేశాడు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో దోపిడి జరుగుతోందని ఆరోపించారు. ఎన్నికల కోసం ఆర్భాటంగా ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభాన్ని ఉద్దేశించి మాట్లాడారు.

Prime Minister Narendra Modi criticized BRS and Congress in Mahabubnagar Sabha

వేల కోట్లతో ప్రాజెక్టులు, సాగునీటి కాల్వలు నిర్మించామని చెప్పుకుంటున్నారని.. కానీ ఏ ఒక్క కాల్వల్లో చుక్క నీరు లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు పథకాల పేరుతో అక్రమంగా సంపాదిస్తోదంని విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. ఎన్నికలు ఉన్నందన ఇప్పుడు మాఫీ చేస్తుందన్నారు. ఓట్లు దండుకుని రాజకీయంగా లబ్దిపొందారని అన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం అన్నదాతలను గౌరవిస్తోందని మోడీ స్పష్టం చేశారు.

తెలంగాణ రైతులకు ఎంఎస్పీ ధరల ద్వారా ఏటా రూ. 27000 కోట్లు అందజేస్తున్నట్లు ప్రధాని గుర్తు చేశారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఏటా తెలంగాణ రైతులకు రూ. 10 వేల కోట్లు వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద పసుపు ఉత్పత్తి దారుగా భారతదేశం ఉందని... పసుపు ఎగుమతి రెట్టింపు అయ్యిందని పేర్కొన్నారు. త్వరలో తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. 2014కు పూర్వం రాష్ట్రంలో 2500 కిలో మీటర్ల జాతీయ రహదారులు నిర్మిస్తే..ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం కేవలం 9 ఏండ్లలో 2500 కిలో మీటర్లకు పైగా జాతీయ రహదారులను నిర్మించినట్లు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+