నేడే వరంగల్‌కు ప్రధాని నరేంద్ర మోడీ: కీలక ప్రాజెక్టులకు శ్రీకారం, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
న్యూఢిల్లీ/వరంగల్: ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్‌లో నేడు పర్యటించనున్నారు. శనివారం ఉదయం వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ హకీంపేట రానున్న ప్రధాని మోడీ.. అక్కడ్నుంచి హెలికాప్టర్ ద్వారా ఉదయం 10.15 గంటలకు వరంగల్‌లోని మూమునూర్ ఏరోడ్రోమ్ చేరుకుంటారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో భద్రకాళీ దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం హనుమకొండ సుబేదారి ఆర్ట్స్ కాలేజీ మైదానానికి చేరుకుంటారు.
ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు, అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అధికారిక కార్యక్రమాలకు ఒక వేదిక.. పార్టీ బహిరంగసభకి మరో వేదిక ఏర్పాటు చేశారు. మోడీకి స్వాగతం పలుకుతూ నగరంలో ఇప్పటికే బీజేపీ నేతలు భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. మోడీ రాకను పురస్కరించుకుని వరంగల్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎస్పీజీ, ఆక్టోపస్, గ్రేహౌండ్స్, సివిల్ పోలీసులతో నాలుగంచెల భద్రత కల్పించారు.

పదివేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. 30 వాహనాలతో నగరంలో పలు మార్లు ట్రయల్ రన్ చేపట్టారు. నగరానికి వచ్చిన కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. సభా ఏర్పాట్లను పరిశీలించారు. అంతకుముందు వరంగల్ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. మోడీ పర్యటన చారిత్రాత్మకమని కిషన్ రెడ్డి అభివర్ణించారు. బహిరంగ సభ కీలకమని.. కల్వకుంట్ల కుటుంబానికి చరమగీతం పాడేందుకు మోడీ ప్రజల ఆశీర్వాదం కోరతారని తెలిపారు. సభకు ప్రజలు భారీగా తరలిరావాలని కోరారు.
రూ.6050కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం
ప్రధాని మోడీ పర్యటనలో భాగంగా.. కాజీపేట సమీపంలో అయోధ్యాపురంలో 160 ఎకరాల్లో నెలకొల్పనున్న రైలు వ్యాగన్ తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు. సుమారు రూ.500 కోట్ల వ్యయంతో.. అధునాతన, సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్న ఈ వ్యాగన్ పరిశ్రమలో నెలకు 200 వరకు వ్యాగన్లు తయారవుతాయి. అలాగే రూ.5,550 కోట్ల విలువైన పలు జాతీయ రహదారులకు ప్రధాని ఇదే కార్యక్రమంలో శంకుస్థాపన చేయనున్నారు.
ప్రధాని @narendramodi అభివృద్ధిపాలనలో భాగస్వామ్యం కండి.
— BJP Telangana (@BJP4Telangana) July 7, 2023
వరంగల్ పర్యటన విజయవంతం చేయండి.#SwagatamModiJi pic.twitter.com/LSMGkXOyKJ
అనంతరం 11.45 నుంచి మధ్యాహ్నం 12.20 గంటల వరకు బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత 12.50 గంటలకు వరంగల్ మామునూరు హెలిప్యాడ్ నుంచి హకీంపేటకు పయనమవుతారు. మధ్యాహ్నం 1.45 గంటలకు హకీంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రాజస్థాన్ కు మోడీ తిరుగు పయనమవుతారు.
Prayed at Shree Bhadrakali Mata Temple at Warangal.
— D K Aruna (@aruna_dk) July 7, 2023
Thereon, reached the venue to oversee the arrangements for PM Shri @narendramodi Ji's public rally, along with State President & Union Minister Shri @kishanreddybjp Ji, National GS & BJP Telangana Incharge Shri @tarunchughbjp… pic.twitter.com/hOf3FBBtrp
కాగా, జులై 8 శనివారం నాడు ప్రధాని మోడీ వరంగల్ పర్యటన సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మోడీ పర్యటన సందర్భంగా వరంగల్, హనుమకొండ నగరాల్లో ట్రాఫిక్ మళ్లింపులతోపాటు ఆంక్షలు ఉంటాయని తెలిపారు. హైదరాబాద్, ఖమ్మం, హుజూరాబాద్, ములుగు ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు తాము సూచించిన మార్గాల్లో ప్రయాణించి సహకరించాలని వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ కోరారు.












Click it and Unblock the Notifications