Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మంత్రి జోగు రామన్నకు తప్పిన ప్రమాదం: 16మందితో లిఫ్ట్ తెగిపడింది!

మంచిర్యాల: తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్నకు పెద్ద ప్రమాదం తప్పింది. మంచిర్యాలలో ఓ టీఆర్ఎస్ కౌన్సిలర్ తనయుడు ఏర్పాటు చేసిన ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన జోగు రామన్న, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు సహా 16మందితో మూడో అంతస్తుకు వెళ్తుండగా.. ఒక్కసారిగా మొదటి అంతస్తులోనే వైర్ తెగిపోవడంతో లిఫ్ట్ కిందపడిపోయింది.

ఊహించని రీతిలో జరిగిన ఈ సంఘటనతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ వెంటనే తేరుకొని గ్రౌండ్ ఫ్లోర్‌లో లిఫ్ట్‌లో ఉన్న మంత్రి రామన్న, ఎమ్మెల్యే దివాకర్ రావు సహా అందరినీ కుర్చీలు వేసీ బయటకు తీశారు.

Private hospital lift collapses; Telangana Minister Jogu Ramanna has a narrow escape

నూతనంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్‌లో 10మంది మాత్రమే వెళ్లే వెసులుబాటు ఉండగా, 16మంది వెళ్లడమే ప్రమాదానికి కారణంగా తెలిసింది. అయితే, మంత్రి సహా మిగితా వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత మంత్రి రామన్న ఆస్పత్రిని ప్రారంభించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+