ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు బంద్.. పెద్ద రీజనే భయ్యా!

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నేడు కళాశాలలు, పాఠశాలలు బంద్ నిర్వహిస్తున్నాయి. నేడు ప్రైవేట్ విద్యాసంస్థలు నిర్వహిస్తున్న ఈ బంద్ దేనికి అనేది తెలిస్తే మాత్రం కాస్త ఆశ్చర్య పోవాల్సిందే. సహజంగా విద్యార్థుల సంక్షేమం కోసం, విద్యార్థుల సమస్యల కోసం పోరాటం చేసే విద్యార్థి సంఘాలు పని చేస్తాయి.

విద్యా సంస్థలు బంద్
అటువంటి విద్యార్థి సంఘాలు భౌతిక దాడులకు పాల్పడడం, చందాలను వసూలు చేయడం వంటి వాటిని నిరసిస్తూ ప్రైవేట్ విద్యా సంస్థలు నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కేజీ నుంచి పీజీ వరకు అన్ని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలను మూసివేశాయి. బంద్ లో భాగంగా నేడు స్కూల్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ హన్మకొండలోని సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వద్ద సమావేశం నిర్వహించి భారీ ర్యాలీ నిర్వహించారు.

private schools and colleges bandh in these districts over the attacks on student unions

భౌతిక దాడులు చేస్తూ, వసూళ్లకు పాల్పడే వారిపైన చర్యలు
హనుమకొండ కలెక్టర్ కు, జిల్లా పోలీసు అధికారులకు విద్యార్థి సంఘాల పేరుతో భౌతిక దాడులు చేస్తూ, వసూళ్లకు పాల్పడే వారిపైన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించారు. ప్రైవేట్ విద్యా సంస్థల పైన ఈ తరహా దాడులు హేయమైన చర్య అని పేర్కొన్న వారు భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

హన్మకొండ స్మైలీ డిజి స్కూల్ కరస్పాండెంట్ పై పీడీఎస్యూ నాయకుల దాడి
ప్రైవేట్ విద్యా సంస్థల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ బంద్ కు పిలుపునివ్వడంతో కేజీ నుంచి పీజీ వరకు అన్ని ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలలు మూతపడ్డాయి. నిన్న హన్మకొండలోని స్మైలీ డిజి స్కూల్ కరస్పాండెంట్ ఎస్ శ్రీనివాస్ వర్మపై పిడిఎస్యు నాయకులు దాడి చేయడంతో, ఆయన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పిడిఎస్యు నాయకుల పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బంద్
హన్మకొండ పోలీసులు వారి పైన కేసు నమోదు చేశారు. స్కూల్ కరస్పాండెంట్ పై విద్యార్థి సంఘాల నాయకుల దాడితో ఈ భౌతిక దాడులు, చందాల వసూళ్ల దందాల పై ప్రైవేట్ విద్యా సంస్థలు నేడు జిల్లావ్యాప్తంగా బంద్ ను కొనసాగిస్తున్నాయి. ప్రైవేటు విద్యా సంస్థల అసోసియేషన్ ఈ భౌతిక దాడిని తీవ్రంగా ఖండించింది.

ఈ జిల్లాలలో స్కూల్స్, కాలేజీలు నేడు బంద్
ఈ పరిణామాల నేపథ్యంలోనే హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భూపాలపల్లి, జనగామ, ములుగు జిల్లాలోని ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలలలో నేడు బంద్ కొనసాగుతుంది. ఈ నిరసన బంద్ కు పి ఎస్ టి, టీపి జె ఎంఏ, కే యు పి ఎం ఏ వంటి ఇతర సంఘాలు కూడా మద్దతును ప్రకటించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+