హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Priyanka reddy murder: మా ఫిర్యాదుకు పోలీసులు స్పందిస్తే మా పాప బ్రతికేది : ప్రియాంక తల్లిదండ్రులు

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దేశంలో సంచలనం సృష్టించిన ప్రియాంక రెడ్డి హత్య కేసులో పోలీసులు 24 గంటల్లో పురోగతి సాధించారు. అయితే ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు పట్టించుకున్నట్లు అయితే తమ బిడ్డ ప్రాణాలతో దక్కలేదని ప్రియాంక రెడ్డి తండ్రి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. 9:30 నుండి ప్రియాంక రెడ్డి ఫోన్ స్విచాఫ్ ఉందని దీంతో రాత్రి 11 గంటల వరకు చూసి అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశామని, అప్పుడే పోలీసులు పట్టించుకుని ఉంటే ఇంత దారుణం జరిగేది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రియాంకారెడ్డి హత్యపై నివేదిక కోరిన జాతీయ మహిళా కమీషన్.. సుమోటోగా కేసు విచారణప్రియాంకారెడ్డి హత్యపై నివేదిక కోరిన జాతీయ మహిళా కమీషన్.. సుమోటోగా కేసు విచారణ

పోలీసులపై ప్రియాంకా రెడ్డి తండ్రి ఆక్రోశం .. ఇప్పుడు ఎన్ని బృందాలు పని చేసి ఏం లాభం

పోలీసులపై ప్రియాంకా రెడ్డి తండ్రి ఆక్రోశం .. ఇప్పుడు ఎన్ని బృందాలు పని చేసి ఏం లాభం

ప్రాణం పోయిన తర్వాత ఎన్ని బృందాలను పెడితే ఏంటి, ఎవరిని అరెస్ట్ చేస్తే ఏంటి అని తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు ప్రియాంకా రెడ్డి తల్లిదండ్రులు. ప్రియాంక రెడ్డి మరణం తర్వాత ఉరుకులు పరుగులు పెడుతున్న పోలీసులను ఉద్దేశించి ఇప్పుడు ఏం చేసినా ఏం లాభమని తండ్రి శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వెంటనే స్పందించి ఉంటే తమ బిడ్డ ప్రాణాలు పోయేవి కాదని డాక్టర్ ప్రియాంకారెడ్డి తల్లిదండ్రులు పేర్కొన్నారు.

రాత్రి 11గంటలకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదన్న తండ్రి శ్రీధర్ రెడ్డి

రాత్రి 11గంటలకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదన్న తండ్రి శ్రీధర్ రెడ్డి

ప్రియాంక రెడ్డి ఫోన్ స్విచాఫ్ అయిన తరువాత రాత్రి 11:00 కు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఉదయం తమ బిడ్డ మరణవార్తను చెప్పారని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ మండలం చటాన్‌పల్లి గ్రామ శివారులోని రోడ్డు బ్రిడ్జి కింద పూర్తిగా తగలబడిన స్థితిలో ప్రియాంకారెడ్డి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు తమకు సమాచారం అందించారని తెలిపారు . దారుణం జరిగాక , ప్రాణాలే పోయాక ఎవరు ఏం చేస్తే ఏం ప్రయోజనం ఉంటుందని ఆయన ప్రశ్నించారు.

సీసీ కెమెరాలు చూసుకుంటూ కూర్చోవడం వల్లే పాప ప్రాణం పోయిందని ఆగ్రహం

సీసీ కెమెరాలు చూసుకుంటూ కూర్చోవడం వల్లే పాప ప్రాణం పోయిందని ఆగ్రహం

ఈ క్రమంలో ప్రియాంకారెడ్డి తండ్రి శ్రీధర్‌రెడ్డి రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ప్రియాంక ఇంటికి రాలేదని ఫోన్‌ వచ్చింది. పదకొండు గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశా. సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ప్రియాంక వెళ్లేటప్పుడు విజువల్స్‌ ఉన్నాయి. వచ్చే విజువల్స్‌ లేవని చెప్పారు. అంతే తప్ప ప్రియాంక రెడ్డి ఏమైంది అన్న విషయాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకోలేదని తండ్రి ఆవేదన చెందారు. సీసీ కెమెరాలు చూసుకుంటూ కూర్చోవడం వల్లే మా పాప ప్రాణం పోయింది.

Recommended Video

Vet Doctor Murder Case Solved, Four People Arrested
పోలీసులు సమయం వృధా చేశారని ఫైర్ .. ఫిర్యాదు చేసినా కాపాడలేదని ఆవేదన

పోలీసులు సమయం వృధా చేశారని ఫైర్ .. ఫిర్యాదు చేసినా కాపాడలేదని ఆవేదన

పోలీసులు సమయం వృథా చేశారు. వెంటనే స్పందించి ఉంటే తను ప్రాణాలతో దక్కలేదని పేర్కొన్నారు. ఫిర్యాదు చేసినప్పటికీ ప్రాణాలతో కాపాడలేని పోలీసుల తీరు చూస్తే మానవత్వం చచ్చిపోయిందా అనిపిస్తోందని ఆయన అన్నారు . ఓ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయడానికి వెళ్తే మరో స్టేషనుకు వెళ్లమన్నారు అని , పోలీసుల స్పందన సరిగా లేదని తమకు జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని ప్రియాంక తండ్రి శ్రీధర్ రెడ్డి తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తమ కూతురు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని విఙ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అమ్మాయిలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

English summary
Priyanka Reddy's parents outrage on police .they have questioned what is the use of the huge police teams to trace out the case after the death . Father Sridhar Reddy has said that they complained at 11 pm and the police checked only ccTV footage. Because of the police neglegency priyanka brutally murdered he said. Dr Priyanka reddy's parents said their child would have survived if the police responded immediately
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X