నిర్మాతల మధ్య బ్లూ ఫిలింల రచ్చ: ఒత్తిడికిలోనై ఆసుపత్రిలో చేరిన నట్టికుమార్

: గ్యాంగ్ స్టర్ నయీంతో టాలీవుడ్‌కు చెందిన పలువురి నిర్మాతలకు సంబంధాలున్నాయంటూ సంచలన ఆరోపణలు చేసిన నిర్మాత నట్టికుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన ప్రస్తుతం సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలోని ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్నారు.

నయీంతో నిర్మాత సి.కల్యాణ్‌కు సంబంధాలున్నాయంటూ నట్టికుమార్ చేసిన ఆరోపణలు టాలీవుడ్‌లో పెను కలకలం రేపాయి. ఈ క్రమంలో గత వారం మీడియా ముందుకు వచ్చిన సి.కల్యాణ్ నట్టికుమార్‌పై వ్యక్తిగత ఆరోపణలు గుప్పించారు. నట్టికుమార్ ఓ పిచ్చి కుక్క అని, చెప్పు తెగుద్ది అంటూ కాస్తంత ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అదేరోజు వెంటనే మీడియా ముందుకు వచ్చిన నట్టికుమార్ కూడా వేగంగానే స్పందించారు. బ్లూఫిలింకేసులో జైలుకెళ్లిన చరిత్ర మరిచారా? దొంగతనాలతోనే సి. కళ్యాణ్‌ ఎదిగాడంటూ ఆయన ఆరోపించారు. ముగ్గురు హీరోయిన్లతో కల్యాణ్‌కు సంబంధాలున్నాయని సి.కల్యాణ్ పై విరుచుకుపడ్డారు.

Producer Natti Kumar admitted in Yashoda Hospital In Hyderabad

ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనైన నట్టికుమార్‌ను ఆయన పిల్లలు కరుణ, క్రాంతి ఆదివారం యశోద ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ తండ్రిపై సి.కల్యాణ్ వ్యక్తిగత ఆరోపణలు గుప్పిస్తున్నారని, తమ తండ్రికి ఏమైనా జరిగితే సి.కల్యాణే బాధ్యత వహించాలని వారు పేర్కొన్నారు.

నయీంతో సి.కల్యాణ్‌కు సంబంధాలున్నాయి కాబట్టే తన తండ్రి ఆరోపణలు చేశారని, తన తండ్రి ఆసుపత్రి నుంచి రాగానే ఆ ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపిస్తామని వారు అన్నారు. సి.కల్యాణ్‌ తమ కుటుంబ వ్యక్తిగత విషయాలపై ఆరోపణలు చేయడం తగదని, తన తండ్రి చేసిన ఆరోపణలు తప్పని రుజువు చేసుకోవాలని డిమాండ్‌ చేశారు.

తమ కుటుంబంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతామని సి.కల్యాణ్‌ను హెచ్చరించారు. నట్టికుమార్‌ పరిస్థితిని 48 గంటల తర్వాతే చెప్పగలమని వైద్యులు చెప్పారని క్రాంతి చెప్పారు. ఇదిలా ఉంటే టాలీవుడ్‌కు చెందిన నిర్మాతలు సి.కల్యాణ్, అశోక్ కుమార్, బండ్ల గణేశ్, సచిన్ జోషిలకు నయీంతో సంబంధాలున్నాయంటూ నట్టి కుమార్ ఇటీవల చేసిన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+