భేతాళ మాంత్రికుడు కెవిపి సలహా మేరకే మార్పులు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావుపై తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు బేతాళ మాంత్రికుడు కేవీపీ సలహా మేరకే తెలంగాణలో ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ చేస్తున్నారని ఆయన విమర్శించారు.

ప్రాజెక్టుల్లో కమీషన్లు ఎలా వసూలు చెయ్యాలో కేవీపీకి తెలిసినంతగా ఎవరికీ తెలియదని దుయ్యబట్టారు. గతంలో ప్రాణహిత-చేవెళ్లకు డిజైన్‌ ఇచ్చినవ్యాప్కోస్‌ సంస్థ ఇప్పుడు ఆడిజైన్‌ పనికిరాదనడంలో మర్మమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు

తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలు ఒకే వేదికపైకి వచ్చి పోరాడాల్సిన పరిస్థితిని కేసీఆర్‌ కల్పించారని రేవంత్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి మహేందర్‌ రెడ్డి రంగారెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణాకు మొట్టమొదట ఎలిమినేటి మాధవరెడ్డి పేరుతో ఎత్తిపోతల పథకాన్ని తెచ్చింది చంద్రబాబేనని స్పష్టం చేశారు. ప్రాణహిత కోసం పోరాడింది కూడా ఆయనేనని రేవంత్‌రెడ్డి చెప్పారు.

Project designs are changing with KVP's advise: Revanth Reddy

ఇదిలావుంటే, శంకర్‌పల్లి మండలం మహలింగపురం దగ్గర ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనులను టిడిపి నేతలు పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం కమీషన్ల కోసం ప్రాజెక్ట్ డిజైన్ మార్చడం దారుణమని మండిపడ్డారు. డిజైన్ మార్పుతో రంగారెడ్డి జిల్లా అన్యాయమవుతుందని మండిపడ్డారు.

కాగా, రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని రైతు ఐక్యకార్యచరణ కమిటీ చైర్మన్‌ చంద్రకుమార్‌ ప్రభుత్వాన్ని విమర్శించారు. రైతుల కుటుంబాలను పరామర్శించాలన్న ఇంగితజ్ఞానం కూడా ప్రభుత్వానికి లేదని ఆయన దుయ్యబట్టారు. రుణమాఫీ సరిగా అమలుకావడం లేదని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+