హైద్రాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు, ముగ్గురి అరెస్ట్

హైదరాబాద్:హైద్రాబాద్‌ నగరంలోని సరస్వతీనగర్‌కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న తల్లి, కొడుకుతోపాటు ఓ విటుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి రూ. 1500 స్వాధీనం చేసుకొన్నారు.ఈ ఘటనలో పట్టుబడిన యువతిని రెస్క్యూటీమ్‌కు తరలించారు.

కృష్ణా కైకలూరు మండలంలోని వరహపట్నం గ్రామానికి చెందిన తాడిశెట్టి ధనలక్ష్మి ఆమె కుమారుడు రవి సరస్వతినగర్‌లోని శ్రీదుర్గ ఎన్‌క్లేవ్ ఫ్లాట్ 102లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సరూర్‌నగర్‌ అలకాపరి కాలనీకి చెందిన గోపాల్ శ్రవణ్ కుమార్, దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రాహుల్ అమ్మాయిలను తీసుకొచ్చేవాడు. ఈ విషయం పోలీసులకు తెలిసింది.

Prostitution Racket Busted In Hyderabad
ఈ మేరకు పథకం ప్రకారంగా పోలీసులు ఈ ఇంటిపై సైదాబాద్ పోలీసులు దాడి చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ధనలక్ష్మి, రవితో పాటు విటుడును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో పట్టుబడిన యువతిని రెస్క్యూటీమ్‌కు తరలించారు. అయితే అమ్మాయిలను సరఫరా చేస్తున్న శ్రవణ్‌కుమార్, రాహుల్ పరారీలో ఉన్నారని సైదాబాద్ ఇన్స్‌పెక్టర్ సత్తయ్య తెలిపారు.

ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు గాను జనావాసాల మధ్యే వ్యభిచారం నిర్వహిస్తున్నారు ఈ ముఠా సభ్యులు. అయితే ఈ వ్యభిచార ముఠాకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు సేకరించి ఇంటిపై దాడి చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+