అద్దె ఇల్లే వ్యభిచార గృహం: మహిళలు, విటుల అరెస్ట్

నగరంలోని రాంచంద్రాపూర్‌లో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంలో గురువారం పోలీసులు దాడి చేసి ముగ్గురు మహిళలకు విముక్తి కలిగించారు. మరో ముగ్గురు విటులను అరెస్టు చేశారు.

కరీంనగర్‌: నగరంలోని రాంచంద్రాపూర్‌లో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంలో గురువారం పోలీసులు దాడి చేసి ముగ్గురు మహిళలకు విముక్తి కలిగించారు. మరో ముగ్గురు విటులను అరెస్టు చేశారు. గురువారం రెండో పోలీస్ స్టేషన్‌లో సీఐ మహేష్‌గౌడ్‌ ముగ్గురు విటులను అరెస్టు చూపించారు.

సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాపూర్‌ మండలం నుస్తులాపూర్‌ గ్రామానికి చెందిన మహిళ(34) నగరంలోని రాంచంద్రాపూర్‌కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటోంది. ఇంట్లో వ్యభిచారం చేయాలని నిర్ణయించిన ఆమె రాజమండ్రి, దవళేశ్వరం నుంచి మహిళ (40), విజయవాడలోని సింగినగర్‌కు చెందిన మహిళ(30), నల్గొండ జిల్లా కోదాడకు చెందిన బాలిక (17)లను కరీంనగర్‌కు తీసుకొచ్చింది.

Prostitution Racket busted by Police in Karimnagar

వీరితో రాంచంద్రాపూర్‌ కాలనీలోని అద్దెకు తీసుకున్న ఇంట్లోనే వ్యభిచారం నిర్వహిస్తోంది. పక్కా సమాచారంతో పోలీసులు గురువారం దాడి చేయగా ఇంట్లో గండ్ర విష్ణువర్దన్‌, పూన మల్లేశం, జక్కుల నవీన్‌ వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు.

ముగ్గురు విటులు, నిర్వాహకురాలును తరలించి కేసు నమోదు చేశారు పోలీసులు. వారి వద్ద నుంచి రూ.4 వేలు స్వాధీనం చేసుకున్నారు. మహిళలను స్వధార్‌ వసతి గృహానికి తరలించినట్లు సీఐ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+