పూజలు చేస్తానని నమ్మించి మహిళపై అత్యాచారం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: సమస్యలతో సతమతమవుతున్న ఓ మహిళను కష్టాల నుంచి గట్టెక్కిస్తానని, పూజల ద్వారా సమస్యలన్నీ తీరుస్తానని నమ్మించి ఓ పూజారి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాదులోని నారాయణ గూడ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. నారాయణగుడా పోలీసులు కేసు నమోదు చేశారు.

నారాయణగుడా ఇన్‌స్పెక్టర్ ఎస్.భీంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం - ఢిల్లీకి చెందిన ఓ మహిళ (45) నారాయణగూడలో నివాసం ఉంటూ ఉద్యోగం చేస్తున్న తన కూతురు వద్దకు ఇటివల కాలంలో వచ్చింది. ఆ మహిళ నారాయణగుడా పోలీస్‌స్టేషన్‌కు ఎదురుగా ఉన్న వీరాంజనేయ సాయిబాబా ఆలయానికి గత వారం రోజుల నుంచి నిత్యం వస్తూ పూజలు చేసి వెళ్తోంది.

Puajari rapes woman in Hyderabad

ఈ క్రమంలో ఆమెను గమనిస్తున్న ప్రధాన పూజారి సహాయకుడు రాము(26) గత మంగళవారం ఆమె సమస్య లను అడిగి తెలుసుకున్నాడు. తాను కష్టాల్లో ఉన్నానని ఆమె చెప్పడంతో ఇదే అదనుగా భావించి పూజారి రాము ప్రత్యేక పూజలు చేస్తే సమస్యలను విముక్తి లభింస్తోందని నమ్మబలికి బుధవారం పూజలు చేస్తాం రావాలని చెప్పాడు. దీంతో ఆమె ఆలయానికి వచ్చింది.

ఆలయం ఆవరణంలో ఉన్న స్టోరూంలోకి తీసుకువెళ్లి పూజలు చేస్తున్నట్లు నటించి ఆమె ఒంటికి పసుపు కుంకుమ రాయాలని వస్త్రాలు తీయాలని కోరాడు. దీంతో ఆమె తన ఒంటిపై ఉన్న దుస్తులు తీసేసింది. పసుపు కుంకుమను ఆమె ఒంటిపై మొత్తం చల్లిన రాము మెల్లగా ఆమెను లొంగదీసుకుని లైంగికదాడికి పాల్పడ్డాడు.

ఆమె అడ్డు చెప్పిన ప్పటికీ బలవం తంగా లొంగదీసుకున్నాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు రాము కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman has been raped at narayanaguda in Hyderabad on the pretext of prayers.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి