పులిహోర ప్యాకెట్లు.. ఫోటోలకు ఫోజులు.. వరద సాయం ఇదేనా?
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అనేక కాలనీలు ముంపుకు గురై జనజీవనం అస్తవ్యస్తంగా మారిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనివిధంగా వరద ముంచెత్తడంతో వరంగల్ నగరంలో 100కు పైగా కాలనీలు నీటమునిగాయి. ప్రజలకు సహాయం అందిస్తామని చెబుతున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు వరద తగ్గిన తర్వాత కాలనీలకు వెళ్లి పులిహోర ప్యాకెట్లు ఇచ్చి, ఫోటోలకు ఫోజులు ఇస్తున్న తీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికీ వరంగల్ నగరంలోని చాలా కాలనీలు ప్రియమైన ముంపు ప్రమాదంలో ఉన్నాయి. ఇళ్లల్లోకి నీరు చేరి ఇళ్లల్లోని వస్తువులన్నీ తడిసిపోయాయి. కనీస ఆహారం కూడా తయారు చేసుకోలేని దయనీయమైన పరిస్థితులు చాలా ఇళ్లలో ఉన్నాయి. మూడు రోజులుగా వరంగల్ నగరవ్యాప్తంగా అంధకారం నెలకొంది. తాగునీరు లేక, విద్యుత్ సదుపాయం లేక, వంట చేసుకునే పరిస్థితి కూడా లేక ఎంతోమంది నరకయాతన అనుభవిస్తున్నారు.

ఇంకా ఐదారు ఫీట్ల వరదనీరు చేరుకున్న ఇళ్ళు ఎన్నో ఉన్నాయి. అయితే వరంగల్ జిల్లావ్యాప్తంగా వరంగల్ జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగం, ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధులు కాలనీలలో పర్యటిస్తూ పులిహోర ప్యాకెట్లు పంచి, తాము ముమ్మరంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మోకాళ్ళ లోతు నీళ్లలో ఫోటోలకు ఫోజులిస్తూ అక్కడి ప్రజలకు భరోసా కల్పించడం మరిచిపోతున్నారు.
తీవ్రమైన వరదలో చిక్కుకున్న ఇళ్లను పక్కనపెట్టి, అపార్ట్మెంట్లలో పర్యటిస్తూ అక్కడి వారికి భరోసా ఇస్తున్నారు. అసలు అవసరమే లేనివారికి, తీవ్రమైన వరదను ఎదుర్కోని వారికి పులిహోర ప్యాకెట్లు పంచుతున్నారు. నగరంలో ముంపు కాలనీలలో అధికారులు, ప్రజాప్రతినిధుల పర్యటనలు విస్మయానికి గురి చేస్తున్నాయి.
వరద ముంపును ఏవిధంగా తొలగించాలి. తీవ్రమైన ఇబ్బందిని ఎదుర్కొంటున్న కుటుంబాలు ఏవి? వారికి ఎటువంటి సహాయం అందించాలి? అనే విషయాన్ని విస్మరించి నామమాత్రంగా పర్యటనలు చేయడం ముంపు ప్రాంతాల ప్రజలకు అటు ప్రతిపక్షాలకు ఆగ్రహం తెప్పిస్తుంది. ముంపు సమస్య రాకుండా శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచన చేయాల్సిన అధికార యంత్రాంగం పులిహోర ప్యాకెట్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం వివిధ కాలనీల ప్రజలకు ఏమాత్రం నచ్చడం లేదు.
ఇప్పటికైనా పబ్లిసిటీని పక్కనపెట్టి ప్రజల క్షేమం కోసం పాలకులు, అధికారి యంత్రాంగం పనిచేయాల్సిన అవసరం ఉందని, ఎప్పుడు వర్షం వచ్చినా వరద ముంపుకు గురవుతున్న ప్రాంతాలను, వరద పరిస్థితుల నుండి కాపాడడం కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించి, తదనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ముంపు ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications