సీఎం కేసీఆర్ ఇలాకాలో పంజాబ్ సీఎం.. కొండపోచమ్మ రిజర్వాయర్‌ను పరిశీలించిన భగవంత్‌మాన్
గజ్వేల్ నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధిని ఆయన పరిశీలించారు. హైదరాబాద్ నుండి గజ్వేల్ కి వెళ్ళిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ కొండపోచమ్మ రిజర్వాయర్ ను పరిశీలించారు.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నేడు తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. తెలంగాణ సీఎం సొంత నియోజకవర్గం అయిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధిని ఆయన పరిశీలించారు. హైదరాబాద్ నుండి గజ్వేల్ కి వెళ్ళిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ కొండపోచమ్మ రిజర్వాయర్ ను పరిశీలించారు. మల్లన్న సాగర్, మర్ముక్ పంప్ హౌస్, పాండవుల చెరువులను కూడా ఆయన పరిశీలించనున్నారు.

తెలంగాణా సాగునీటి ప్రాజెక్ట్ ల పరిశీలనలో భగవంత్ మాన్
ఇప్పటికే అనేక మార్లు తెలంగాణాలో పర్యటించిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మళ్ళీ ఇప్పుడు తెలంగాణా సాగునీటి ప్రాజెక్ట్ లపై అధ్యయనం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధిని పరిశీలించేందుకు వచ్చిన పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ ఈరోజు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ ను సందర్శించారు. మొదటగా కొండపోచమ్మ సాగర్ పంప్ హౌస్ ను పరిశీలించి.. ప్రాజెక్టు యొక్క వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

భగవంత్ మాన్ కు తెలంగాణా సాగునీటి ప్రాజెక్ట్ ల గురించి వివరించిన రజత్ కుమార్
తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం గురించి.. ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్ ల గురించి సీఎం భగవంత్ మాన్ కు వివరించారు. కాళేశ్వరం నుండి 618 మీటర్ల ఎత్తులో కొండపోచమ్మ సాగర్ ఉందని, 15 టిఎంసిల సామర్థ్యంతో ఈ రిజర్వాయర్ని ప్రభుత్వం నిర్మించిందని రజత్ కుమార్ పంజాబ్ సీఎంకు వివరించారు. ఇది 2,85,280 ఎకరాలకు సాగునీటిని అందిస్తుందని ఆయన తెలిపారు. అనంతరం ఎర్రవెల్లి- నరసన్నపేట గ్రామాల మధ్యలో ఉన్న ఎర్రవెల్లి చెక్ డ్యాంను పంజాబ్ సీఎం పరిశీలించారు.
భూగర్భ జలాల పరిరక్షణకు తెలంగాణా చర్యలను పరిశీలిస్తున్న పంజాబ్ సీఎం
భూగర్భ జలాలను కాపాడడం కోసం గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక పనులను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ బృందం పరిశీలిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో చేసిన మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ, చెక్ డ్యాం ల నిర్మాణ పనులను అధ్యయనం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో భూగర్భ జలాల పరిరక్షణకు తీసుకున్న అనేక చర్యలను నిశితంగా పరిశీలించి అనంతరం తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications