అల్లు అర్జున్ జాతకం అంతా సీసీటీవీ ఫుటేజీల్లో..!!

Balmuri Venkat: అల్లు అర్జున్ అరెస్ట్ నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డ తొమ్మిదేళ్ల బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండట్లేదు. ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది.

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో దిల్‌సుఖ్‌‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. తొమ్మిది సంవత్సరాల వయస్సున్న ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. కిమ్స్ ఆసుపత్రి పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నాడు.

Pushpa 2 stampede MLC Balmuri Venkat criticizes Allu Arjun after his Pressmeet

ఈ ఘటనను తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ముందు రాష్ట్రంలో ఎలాంటి బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వకూడదని నిర్ణయించింది. అలాంటి షోలు రద్దు చేస్తామంటూ నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా వెల్లడించారు. రేవతి మృతిపట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి సభలో ప్రసంగించిన అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అనుమతి లేకుండా, బాధ్యతారహితంగా సంధ్యా థియేటర్‌కు వెళ్లాననడం సరికాదని, అది తప్పుడు సమాచారమని అన్నారు. ఇదొక యాక్సిడెంట్ మాత్రమేనని, ఇందులో ఎవరి తప్పూలేదని చెప్పారు. సంధ్య థియేటర్ వద్ద రోడ్‌షో చేయలేదని, పోలీసుల డైరెక్షన్‌లోనే థియేటర్‌కు వెళ్లాననీ అన్నారు.

దీనిపై తెలంగాణ కాంగ్రెస్ శాసన మండలి సభ్యుడు బల్మూరి వెంకట్ ఘాటుగా స్పందించారు. అల్లు అర్జున్ తన మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితబోధ చేశారు. ప్రెస్ మీట్ పెడుతున్నాడంటే పశ్చాతాపం ప్రకటిస్తాడు అనుకున్నామని, దీనికి భిన్నంగా ప్రవర్తించారని విమర్శించారు.

Pushpa 2 stampede MLC Balmuri Venkat criticizes Allu Arjun after his Pressmeet

తొక్కిసలాట జరిగి రేవతి చనిపోయిన తరువాత కూడా ఎప్పటి వరకు థియేటర్‌లో ఉన్నాడో, వెళ్లేటప్పుడు ఎలా వెళ్లాడో అక్కడి సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయి ఉందని గుర్తు చేశారు. రేవతి చనిపోయిన మరుసటి రోజు అల్లు అర్జున్ తన ఇంటి వద్ద టపాసులు కాల్చారని మండిపడ్డారు.

తెలుగు వాడి సత్తా చాటడం అంటే ప్రాణాలు పోయినా పట్టించుకోకపోవడం కాదని, తన వల్ల తెలుసో, తెలియకో తప్పు జరిగినా, దానివల్ల ఎవరికైనా నష్టం జరిగినా దానిపై సానుభూతితో స్పందించడం, బాధిత కుటుంబానికి ఆదుకోవడమేనని, దీనికి భిన్నంగా అల్లు అర్జున్ వ్యవహరించాడని బల్మూరి వెంకట్ విమర్శించారు.

తమది ప్రజా పాలన అది, ప్రజలకు నష్టం జరిగేలా ఎవరు తప్పు చేసినా ఊరుకోబోమని, శిక్షిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో భరోసా ఇస్తోంటే.. దానికి వ్యతిరేకంగా ఇలా ప్రెస్ మీట్ పెట్టడం సరికాదని, అక్కడ మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవలని బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+