టాలీవుడ్‌కు బిగ్ షాక్: అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి సంచలన ప్రకటన
Pushpa 2 stampede : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలకు బిగ్ షాక్ ఇచ్చింది. ఇకపై ఎలాంటి బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది. ఏ సినిమాకైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఒక్క బెనిఫిట్/ప్రీమియర్ షోను ప్రదర్శించడానికి ఎలాంటి అనుమతులను మంజూరు చేయకూడదని తీర్మానించింది.
ఈ విషయాన్ని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా సభలో ఓ ప్రకటన చేశారు. పుష్ప 2 ది రూల్ బెనిఫిట్ షో సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఓ మహిళ దుర్మరణం పాలు కావడం, ఓ బాలుడు తీవ్రంగా గాయపడిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందారు. తొమ్మిది సంవత్సరాల వయస్సున్న ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో బ్రెయిన్ డ్యామేజ్ అయిన స్థితిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. హీరో అల్లు అర్జున్, చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌పై ఎఫ్ఐఆర్ పెట్టారు. అల్లు అర్జున్ అరెస్ట్ కూడా అయ్యారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. అల్లు అర్జున్‌కు అభిమాని కావడం వల్ల తన కుమారుడి కోసమే కుటుంబంతో కలిసి సినిమాకు వచ్చినట్లుగా రేవతి భర్త ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ తొక్కిసలాట ఘటన పట్ల తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. దీన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఇక ముందు బెనిఫిట్ షోలకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని నిర్ణయించింది. బెనిఫిట్/ ప్రీమియర్ షోలు రద్దు చేసేలా, రెగ్యులర్ షోలు మాత్రమే ప్రదర్శించుకునేలా త్వరలోనే ఉత్తర్వులను జారీ చేస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. రేవతి మృతిపట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలచివేసిందని చెప్పారు. ఇక నుంచి బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వబోమని స్పష్టం చేశారు. థియేటర్‌లో తొక్కిసలాట చోటు చేసుకుని ఓ నిండు ప్రాణం పోవడం బాధాకరమని అన్నారు.
ఈ ఘటన పట్ల హీరో గానీ, పుష్ప 2 సినిమా యూనిట్ గానీ స్పందించకపోవడాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్పుపట్టారు. సినిమా కలెక్షన్ల కోసం ఓ నిండు ప్రాణాన్ని తీస్తారా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వందలు, వేల కోట్ల రూపాయల మేర కలెక్షన్లు వస్తాయని నిర్మాణ సంస్థ చెబుతోందని, మృతురాలి కుటుంబానికి 25 లక్షల రూపాయల నష్ట పరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారాయన.
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications