సింధు సహా వారికి బీఎండబ్ల్యు కార్లు ఇచ్చిన సచిన్, సెల్ఫీ దిగారు
హైదరాబాద్: ఒలింపిక్ విజయాలకు ఇది ప్రారంభం మాత్రమేనని, విజయపరంపర ఆగకూడదని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఆదివారం నాడు అన్నారు. ఆదివారం గచ్చిబౌలీ స్టేడియంలో ఒలింపిక్ విజేతలకు బీఎండబ్ల్యూ కార్లను బహూకరించారు.
ఈ సందర్భంగా సచిన్ మాట్లాడారు. సాక్షి మాలిక్, పీవీ సింధు, దీపా కర్మాకర్‌లను చూసి తాను గర్వపడుతున్నానని చెప్పారు. భారతీయ క్రీడలకు ఇది శుభదినమన్నారు. ఒలింపిక్స్‌లో సత్తా చాటిన క్రీడాకారులను ప్రోత్సహించడం సంతోషంగా ఉందన్నారు.
సింధు వెన్నంటి ఉండి గోపిచంద్ చక్కగా ప్రోత్సహించారన్నారు. తాను మ్యాచులను ఉత్కంఠగా చూశానని చెప్పారు. దీపా కర్మాకర్ పతకం గెలవకున్నా దేశ ప్రజల మనసులు గెలుచుకుందన్నారు. కోచ్‌గా గోపీచంద్ సేవలు అమోఘమన్నారు.
సెల్ఫీ తీసుకున్న సచిన్
ఒలింపిక్స్‌లో పాల్గొని అద్భుత ప్రతిభ చూపిన సింధు, సాక్షి, దీప, బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్‌లతో సచిన్ టెండుల్కర్ సెల్ఫీ తీసుకున్నారు. అంతకుముందు హైదరాబాద్ వచ్చిన సచిన్ టెండుల్కర్ నేరుగా పుల్లెల గోపీచంద్ అకాడమీకి చేరుకున్నారు.
గోపీచంద్ మాట్లాడుతూ.. రియోలో ముగ్గురు చక్కగా రాణించారని చెప్పారు. భవిష్యత్తులో మరింత బాగా రాణిస్తారని భావిస్తున్నానని చెప్పారు. సాక్షి మాలిక్ మాట్లాడుతూ.. తాను ఒంటరిగా వెళ్లి, కోట్లాది భారతీయుల అభిమానంతో తిరిగి వచ్చానన్నారు. దీపా కర్మాకర్ మాట్లాడుతూ... ఇంతటి ప్రోత్సాహం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు అన్నారు. పీవీ సింధు మాట్లాడుతూ.. మరిన్ని విజయాలు సాధిస్తానన్నారు.

బహుమతి
ఒలింపిక్ విజయాలకు ఇది ప్రారంభం మాత్రమేనని, విజయపరంపర ఆగకూడదని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఆదివారం నాడు అన్నారు. ఆదివారం గచ్చిబౌలీ స్టేడియంలో ఒలింపిక్ విజేతలకు బీఎండబ్ల్యూ కార్లను బహూకరించారు.

మొక్కు తీర్చుకున్న పీవీ సింధు
రియో ఒలింపిక్స్‌లో రజతం గెలుచుకున్న బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధు శనివారం నాడు భాగ్యనగరంలోని లాల్ దర్వాజలో మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు.

ప్రతి ఏడాది అమ్మవారి ఆశీస్సులు
ఈ సందర్భంగా పీవీ సింధు మీడియాతో మాట్లాడుతూ.. ప్రతీ సంవత్సరం అమ్మవారిని దర్శించుకుంటానని, రియో బయలుదేరే ముందు అమ్మవారిని దర్శించుకున్నానని తెలిపారు.

మొక్కుకున్నా
పతకం గెలిస్తే మళ్లీ దర్శించుకుంటానని మొక్కుకున్నానని సింధు అన్నారు. పతకం గెలవడంతో కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నానని చెప్పారు.

పీవీ సింధు
లాల్ దర్వాజ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన పీవీ సింధుకు జాతీయ పతాకాలతోను పలువురు స్వాగతం పలికారు.

పీవీ సింధు
రియో ఒలింపిక్స్‌లో రజతం గెలుచుకున్న బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధు శనివారం నాడు భాగ్యనగరంలోని లాల్ దర్వాజలో మహంకాళీ అమ్మవారిని దర్శించుకొని, మొక్కు చెల్లించుకున్నారు.

పీవీ సింధు
రియో ఒలింపిక్స్‌లో రజతం గెలుచుకున్న బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధు శనివారం నాడు భాగ్యనగరంలోని లాల్ దర్వాజలో మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు.

పీవీ సింధు
రియో ఒలింపిక్స్‌లో రజతం గెలుచుకున్న బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధు శనివారం నాడు భాగ్యనగరంలోని లాల్ దర్వాజలో మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ యాజమాన్యం ఆమెను సన్మానించింది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications