‘హైదరాబాద్‌ డాగ్‌’ను తప్పించండి: అప్పటి జేడీ లక్ష్మీనారాయణపై కుట్ర కోణం

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో లక్ష్మీనారాయణ చాలా కేసులను ఓ కొలిక్కి తెచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఆ సమయంలో జరిగిన ఓ కీలక పరిణామం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

చిక్కుల్లో షబ్బీర్ అలీ: 1.5కోట్ల లంచం కేసులో ఈడీ ఛార్జీ‌షీటు

ఎమ్మార్‌ కేసులో నిందితుడిగా ఉన్న కోనేరు రాజేంద్రప్రసాద్‌ను సీబీఐ కేసు నుంచి తప్పించడానికి ఆయన కుమారుడు కోనేరు ప్రదీప్‌ మాంసం ఎగుమతిదారు ఖురేషీ ద్వారా తీవ్రంగా ప్రయత్నించారు. ఇందులో భాగంగా కేసు గురించి, సీబీఐ దర్యాప్తు అధికారుల గురించి ఫోన్‌లో నేరుగా ప్రస్తావించకుండా సంకేత భాషను ఉపయోగించడం గమనార్హం.

షాక్: ఈడీ ఛార్జీషీట్లో షబ్బీర్ అలీతో పాటు బొత్స, సుఖేష్‌ను రక్షించేందుకు రంగంలోకి

qureshi and koneru pradeep calls Lakshmi Narayana as hyderabad dog

ఎమ్మార్‌ కేసు దర్యాప్తు సందర్భంగా అప్పటి సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ (లక్ష్మీనారాయణ)ను 'హైదరాబాద్‌ డాగ్‌'గా పేర్కొన్నారు. కేసు నుంచి ఆయనను తప్పించేందుకు చర్యలు తీసుకోవాలని వాళ్ల మాటలు సాగాయి. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం సంచలనంగా మారింది.

ఖురేషీ హవాలా లావాదేవీల దర్యాప్తులో భాగంగా ఢీల్లీ ఈడీ అధికారులు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని కోనేరు ప్రదీప్‌ నివాసంలో దాడులు చేసి బ్లాక్‌బెర్రీ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫోన్‌ ద్వారా జరిగిన సంభాషణల్లో ఈ విషయాలు వెల్లడైనట్లు ఈడీ పేర్కొంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that qureshi and koneru pradeep calls Lakshmi Narayana as hyderabad dog.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి