సీఎం అభ్యర్థి కృష్ణయ్య దూరమే, బీజేపీ వ్యూహమా?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి బీసీ సంఘం అధ్యక్షులు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య దూరం అయినట్లేనా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు.
ఎన్నికల్లో టీడీపీ కేవలం 15 సీట్లతో సరిపెట్టుకుంది. ఎన్నికల తర్వాత నుండి టీడీపీతో కృష్ణయ్య కొంత దూరం పాటిస్తున్నట్లుగా కనిపించింది. ఇటీవల ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడు కార్యక్రమానికి ఆయన హాజరు కాలేదు. దీనిపై అనంతరం చంద్రబాబు చర్చించారు కూడా.
సోమవారం నాడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆర్ కృష్ణయ్య నోటాకు ఓటు వేశారు. టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డిని కూడా ఆయన తిరస్కరించారు. దీంతో ఆయన చంద్రబాబుకు ఝలక్ ఇచ్చినట్లేనని అంటున్నారు. త్వరలో కార్యాచరణ ప్రకటించవచ్చునని చెబుతున్నారు.

మరోవైపు, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారా అనే చర్చ సాగుతోంది. వారు తొలి ప్రాధాన్యత ఓటును టీడీపీ అభ్యర్థికి వేశారు. రెండో ప్రాధాన్యత ఓటును నోటాకు వేశారు. ఇది చర్చనీయాంశమవుతోంది.
టీడీపీకి మద్దతిచ్చినట్లుగా ఉంటూనే.. వ్యూహాత్మకంగా అలా ఓటు వేశారా అనే చర్చ సాగుతోంది. సీనియర్ నేతలు ఉన్న బీజేపీ రెండు ప్రాధాన్యత ఓట్ల పైన అలా ఎందుకు వేశారనే తెలంగాణ టీడీపీ నేతలు కూడా చర్చించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications