వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

MUST READ:డిజిటల్ పాసులను ప్రారంభించిన రాచకొండ పోలీసులు..అత్యవసర సమయాల్లో..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాదు: లాక్‌డౌన్ సందర్భంగా అత్యవసర సేవలను వినియోగించుకునేందుకు రాచకొండ పోలీసులు ఒక వినూత్నమైన పద్ధతిని ప్రవేశపెట్టారు. "ఎసెన్షియల్ సర్వీసెస్ డిజిటల్ పాస్" పేరుతో కొత్త పాస్‌లను ఇస్తున్నారు. ఇలాంటి ఎసెన్షియల్ పాస్ కావాలనుకునే వారు వెబ్‌సైట్‌కు లాగిన్ అయి అక్కడి నుంచి పొందొచ్చని రాచకొండ పోలీస్ తెలిపింది. లాక్‌డౌన్‌తో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఈ పద్ధతిని తీసుకొచ్చినట్లు రాచకొండ కమిషనరేట్ పేర్కొంది. ఈ ఈ-పోర్టల్‌ను కొద్దిరోజుల క్రితమే ప్రారంభించడం జరిగింది.

 ఎసెన్షియల్ సర్వీసెస్ డిజిటల్ పాస్

ఎసెన్షియల్ సర్వీసెస్ డిజిటల్ పాస్

ఎసెన్షియల్ సర్వీసెస్ డిజిటల్ పాస్ అనే ఈ ఈ-పోర్టల్‌ను డీసీపీ అడ్మిన్ శిల్ప వల్లి, ఐటీసెల్‌ మరియు సేఫ్ సిటీ కన్సల్టెంట్ రాజేష్‌లు సంయుక్తంగా కలిసి తయారు చేశారని రాచకొండ కమిషనరేట్ మహేష్ భగవత్ చెప్పారు. ఇక ఈ పాస్‌కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో శిల్ప వల్లి చెప్పారు. ఆధార్ సంఖ్యలోని చివరి నాలుగు నెంబర్లు సమర్పించాల్సి ఉంటుందని అదే సమయంలో ఎమర్జెన్సీ పాస్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారో అనేదానిపై స్పష్టమైన కారణం చెప్పాలని ఆమె వివరించారు. ఇక ఒక్కసారి సబ్మిట్ బటన్ నొక్కితే ప్రక్రియ ప్రారంభిస్తామని పాస్ ఎందుకు కావాలనుకుంటున్నారో అని చెప్పే కారణం ఆధారంగా పాస్ జారీచేయడమా లేక తిరస్కరించడమా అనేది జరుగుతుందని శిల్ప చెప్పారు. పాస్ జారీచేసే ప్రక్రియ ప్రారంభమైతే దరఖాస్తుదారులకు ఒక నోటిఫికేషన్ వెళుతుందని చెప్పారు. డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ వస్తుందని చెప్పారు.

 మూడు కేటగిరీలుగా విభజన

మూడు కేటగిరీలుగా విభజన

ఇక అత్యవసర సేవల పాస్‌లను మూడు కేటగిరీలుగా విభజించినట్లు చెప్పారు. వ్యక్తిగత పాస్‌లు, వెహికల్ పాస్‌లు, ఉద్యోగస్తుల కోసం ఆర్గనైజేషన్ పాస్‌లుగా విభజించామని చెప్పారు. ఇక వ్యక్తిగత పాస్‌ల కేటగిరీలో రోజూవారీ డయాలసిస్‌కు వెళ్లే వారికి, కిరాణా స్టోర్స్‌ ఓనర్లకు జారీ చేయడం జరిగిందని చెప్పిన శిల్ప వల్లి... తమ ఉద్యోగస్తులను తరలించేందుకు వాహనాలు ఏర్పాటు చేసిన సంస్థలకు వెహికల్ పాస్‌లు జారీ చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు అత్యవసర సేవలు హాజరు అవుతున్న ఒక్క ఉద్యోగికి కూడా ఆర్గనైజేషన్ పాస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.

వ్యాలిడిటీ ఎన్ని రోజులు ?

వ్యాలిడిటీ ఎన్ని రోజులు ?

ఏప్రిల్ 10 నాటికి రాచకొండ కమిషనరేట్ పరిధిలో 1828 పాసులకు ఓకే చేయగా 1496 పాసులను తిరస్కరించడం జరిగిందని రాచకొండ పోలీస్ శాఖ తెలిపింది. ఇక పాసుల వ్యాలిడిటీ వారి ట్రావెల్‌పై ఆధారపడి ఉంటుంది. మెడికల్ పాస్‌లు ఒకరోజు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుండగా, రవాణా చేసే లారీలకు లాక్‌డౌన్ ఎత్తివేసే వరకు పాస్‌ల వ్యాలిడిటీ అమల్లో ఉంటుందని చెప్పారు. డిజిటల్ పాస్‌లపై క్యూఆర్ కోడ్ ఉంటుందని, చెక్ పోస్టుల వద్ద పోలీసులు స్కాన్ చేసి దాని వ్యాలిడిటీని గుర్తించే వీలు కల్పించామని వెల్లడించారు. పాస్‌లో ఎలాంటి రూట్లో ప్రయాణిస్తున్నారు, ఎంత దూరం ప్రయాణిస్తున్నారు, ఇతర వ్యక్తిగత వివరాలు పాస్‌ పై ఉంటాయని రాచకొండ పోలీస్ కమిషనరేట్ తెలిపింది.

Recommended Video

Lockdown : Trains Likely To Available From 15th April
 పిక్ అండ్ డ్రాప్ సదుపాయం కూడా...

పిక్ అండ్ డ్రాప్ సదుపాయం కూడా...

డిజిటల్ పాస్ కలిగి నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం చర్యలు తప్పవని పోలీసు శాఖ హెచ్చరించింది. అదే సమయంలో సామాజిక దూరంను పాటించాలని విజ్ఞప్తి చేసింది. పాస్ వ్యాలిడిటీ అయిపోతే క్యూఆర్ కోడ్ ఇన్‌వాలిడ్ అవుతుందని శిల్ప వల్లి వివరించారు. ఇది ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఇదిలా ఉంటే డయాలసిస్ పేషెంట్స్, రెగ్యులర్ చెకప్ చేసుకునేవారికి, రక్తం మార్చుకోవాల్సిన వారికి , సీనియర్ సిటిజెన్స్, ఒంటరి మహిళ, మెడికల్ చెకప్‌కు వెళ్లే దివ్యాంగులకు, ఆర్థిక సేవలు వినియోగించుకునేవారికోసం రాచకొండ పోలీసులు ఉచితంగా పికప్ డ్రాప్ సదుపాయం కల్పిస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనరేట్ స్పష్టం చేసింది. ఈ సదుపాయాలు వినియోగించుకోవాలంటే రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ ‌ రూంకు ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్ 9490617234 అని స్పష్టం చేసింది.

English summary
To facilitate emergency services during lockdown, the Rachakonda police has come-up with an ‘Essential Services Digital Pass’. Those in need of a pass can log into the website.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X